
ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు . ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి 29 సినిమా నుంచి టీజర్ ..లేకపోతే ఒక వీడియో.. ఆయన క్యారెక్టర్ నేమ్ రివిల్ చేస్తున్న అప్డేట్ ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది అంటూ గత కొన్ని రోజుల నుంచి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . కానీ అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి అలాంటిది ఏవీ ప్లాన్ చేయలేదు అంటూ తెలుస్తుంది . జస్ట్ ఒక చిన్న పిక్చర్ రిలీజ్ చేసి దాన్నే వీడియో రూపంలో అభిమానులకి చూపించబోతున్నారట . కొంతమంది అయితే అసలు ఇది కూడా ప్లాన్ చేయలేదు రాజమౌళి అంటూ మాట్లాడుతున్నారు.
దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. గుంటూరు కారం తర్వాత అసలు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో తెరక్కుతున్న సినిమాకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ అఫీషియల్ గా ప్రకటించలేదు. అడపదడపా లీక్డ్ వీడియోస్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అయితే ఇకపై ఇలా రాజమౌళి సినిమా షూట్ ను ఆలస్యం చేసిన లేదంటే సినిమా అప్డేట్స్ ఇవ్వకపోయినా ఊరుకునేదే లేదు అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. క్రికెట్ లు చూస్తూ..ఫ్యామిలీ ఫంక్షన్ అంటూ రాజమౌళి టైం వేస్ట్ చేస్తున్నారు అని ..ప్రియాంక చోప్రా తన భర్తతో బాగా ఎంజాయ్ చేస్తుంది అని.. ఇక మహేష్ బాబు వెకేషన్ లు అంటూ వెళ్ళిపోతున్నాడు అని ..అస్సలు ఈ సినిమా షూట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ..? ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారు..? ఎప్పుడు రిలీజ్ చేస్తారు..? అనే విధంగా ఘాటుఘాటుగా ఫైర్ అవుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!