
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో ఏకంగా 75 రోజుల పాటు పాల్గొన్నానని చెప్పారు. ఎన్ని అంచనాలను పెట్టుకున్నా ఆ అంచనాలను మించే విధంగా ఈ సినిమా ఉండబోతుందని తారక్ హామీ ఇవ్వడం ఫ్యాన్స్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. వార్2 సినిమాను నిజాం ఏరియాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.
వార్2 సినిమా ఇతర ఏరియాల హక్కులు మాత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ రెగ్యులర్ బయ్యర్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వార్2 సినిమా నిర్మాతలకు విడుదలకు ముందే మంచి లాభాలను అందించినని సమాచారం అందుతోంది. వార్2 మూవీ ఇతర ఏరియాల బుకింగ్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. వార్2 సినిమా సక్సెస్ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.
వార్2 సినిమా బుకింగ్స్ మొదలైతే ఈ సినిమా అసలు రేంజ్ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం ఈ సినిమాతో మంచి రోజులు రావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఎన్టీఆర్ నమ్మకాన్ని, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతమేర నిలబెట్టుకుంటుందో చూడాలి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మాత్రం ఊహించని స్థాయిలో పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.