
ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంది తన కెరియర్, పెళ్లి విషయం పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ కూడా ఈమె ఎక్కువగా తమిళంలోనే చిత్రాలు చేస్తున్నారనే విషయంపై ప్రశ్నించగా.. తాను ఏదీ కూడా ప్లాన్ చేసుకోలేదు ఒక యాక్టర్ గా తనకు నచ్చిన పనిని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్తున్నానని తెలిపింది. సినీ కెరియర్ తెలుగు నుంచి మొదలు పెట్టాను.. కానీ తమిళంలో మంచి క్యారెక్టర్స్ రావడంతో అలాగే తాను చదువుకుంటున్న రోజులు కావడం చేత అటు చదువుతోపాటు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని తెలుగు సినిమాలకు కొంత బ్రేక్ తీసుకున్నానని తెలిపింది.
అందుకే తమిళంలోనే తాను ఎక్కువ సినిమాలలో చేసే అవకాశం వచ్చిందని తెలిపింది. అలాగే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడంపై కూడా స్పందిస్తూ.. తనకు వివాహం అయితే సినీ కెరియర్ కు బ్రేక్ పడిందని తాను ఎప్పుడూ అనుకోలేదని నాకు టాలెంట్ ఉంది కాబట్టే అవకాశాలు వస్తున్నాయని నమ్మాను.. ఆ నమ్మకంతోనే తాను 24 ఏళ్లకే వివాహం చేసుకున్నానని దాని గురించి తాను ఎప్పుడు బాధపడలేదు అంటూ తెలియజేసింది ఆనంది. ప్రస్తుతం ఆనంది చేసిన ఈ కామెంట్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. చివరిగా ఈమె భైరవం అనే సినిమాలో నటించింది.