సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకి పండుగే. ఈసారి కూడా ఆ జోష్ మరింత రెట్టింపు అయింది. దేశం నలుమూలల నుంచి విషెస్ వెల్లువెత్తాయి. కానీ వాటిలో రెండు విషెస్ మాత్రం ప్రత్యేకంగా నిలిచాయి. అవి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఎస్‌.ఎస్‌. రాజమౌళి కుమారుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ నుంచి వచ్చాయి. మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అప్రతిహత క్రేజ్, ఉత్తరాది బెల్ట్‌లో కూడా మంచి మార్కెట్ కలిగిన హీరో. చాలా సార్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినా, మహేష్ ఎప్పుడూ తెలుగులోనే సినిమాలు చేస్తూ తన అభిమానుల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. అయితే ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న గ్లోబ్ ట్రోటర్ (SSMB29) మహేష్ కెరీర్‌లోనే అతిపెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది.
 

అభిమానులు ఇది మహేష్‌ని 1000 కోట్ల క్లబ్ హీరోగా నిలబెడుతుందని నమ్ముతున్నారు. ఈ సందర్భంగా సందీప్ వంగా చేసిన విష్ హృదయాన్ని తాకింది. "పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ సార్! మీరు ప్రతీ సంవత్సరం మరింత ప్రకాశవంతంగా వెలుగుతారు. వెండితెరపై మీరు చూపే మాయాజాలం మాదిరిగా మీ స్పెషల్ డే కూడా మెరుస్తూ ఉండాలి. సరిహద్దులు దాటి ప్రేక్షకులను అలరించే, రికార్డులను బద్దలు కొట్టే మరో సంవత్సరానికి ఆల్ ది బెస్ట్" అంటూ వంగా ట్వీట్ చేశారు. గతంలో మహేష్‌తో సినిమా చేయాలని వంగా అనుకున్నా, స్టోరీ సెట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. కానీ ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ విజయాల తర్వాత వంగా రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇప్పుడు అతని స్పెషల్ విష్ చూసి ఫ్యాన్స్, ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.



మరోవైపు, ఎస్‌.ఎస్‌. కార్తికేయ కూడా మహేష్ బర్త్‌డే విషెస్‌ను ప్రత్యేకంగా మార్చారు. ఒక అభిమాని రూపొందించిన WishSSMB.com వెబ్‌సైట్ లింక్‌ను షేర్ చేస్తూ, "ఇలాంటి అద్భుతమైన ఆలోచనకు అభినందనలు" అంటూ ప్రోత్సహించారు. ఈ సైట్ ద్వారా ప్రపంచం నలుమూలల నుండి అభిమానులు మహేష్‌కు శుభాకాంక్షలు తెలిపే అవకాశం కల్పించారు. కార్తికేయ ప్రస్తుతం గ్లోబ్ ట్రోటర్ ప్రమోషన్స్‌తో పాటు ఇతర కీలక విభాగాల్లో కూడా కీలక భూమిక పోషిస్తున్నారు. మహేష్ పుట్టినరోజుకు ఈసారి వచ్చిన ఈ రెండు స్పెషల్ విషెస్, అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. మరి స్పిరిట్ తర్వాత సందీప్ వంగా మహేష్ కోసం కొత్త కథతో వస్తాడా? లేక ‘యానిమల్’ సీక్వెల్‌కే వెళ్తాడా? అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ అవుతుంది. కానీ మహేష్ – వంగా కాంబినేషన్ కోసం అభిమానులు ఇప్పటికే లుకింగ్ ఫార్వర్డ్‌లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: