ఇక కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఆడియన్స్ ఎగ్జైట్‌మెంట్ డబుల్ అయింది. కానీ అసలు మాస్టర్ ట్విస్ట్ ఏమిటంటే - అమీర్ ఖాన్ రోల్. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, విక్రం చివర్లో సూర్యను రోలెక్స్‌గా ఇంట్రడ్యూస్ చేసినట్లుగానే, కూలీ క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ ఎంట్రీ ఉండబోతోందట. అయితే రోలెక్స్ అనే పేరు కాకపోవచ్చు, కానీ అదే స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌గా వస్తాడట. ట్రైలర్‌లోనే అతని యాక్షన్ షాట్స్ హైలైట్ అయ్యాయి. క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ ఎంట్రీ కేవలం సర్‌ప్రైజ్ మాత్రమే కాదు - ఇది లోకేష్ యూనివర్స్‌కి కొత్త డైమెన్షన్ జోడించేలా ఉంటుందట. విక్రంలో సూర్య ఎంట్రీతో ఆ సినిమా మరో ఎత్తుకు వెళ్లింది.
అలాగే కూలీలో అమీర్ రావడం వల్ల థియేటర్‌లో ఫ్యాన్స్ రియాక్షన్ ఊహించుకోవచ్చు. పైగా, అమీర్ ఖాన్ రోల్ బాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా కనెక్ట్ చేస్తుంది కాబట్టి, హిందీ బాక్సాఫీస్‌లో కూడా కూలీకి సాలిడ్ బూస్ట్ దొరకనుంది. లోకేష్ – రజినీ కాంబినేషన్ మీద అంచనాలు ఇప్పటికే పీక్స్‌లో ఉండగా, దీనికి అమీర్ ఖాన్ ఎంట్రీ కలిస్తే ఆ అంచనాలు మించి హంగామా జరుగుతుందనడంలో సందేహం లేదు. వార్ 2 వంటి బలమైన కాంపిటీషన్ ఉన్నప్పటికీ, కూలీ టీమ్ మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. లోకేష్ ప్లానింగ్, రజినీ మాస్, నాగార్జున విలనిజం, ఉపేంద్ర పవర్, అమీర్ ఖాన్ సర్‌ప్రైజ్ — ఈ మిశ్రమం బాక్సాఫీస్‌లో సునామీ తెస్తుందనడంలో రెండో మాట లేదు. మరి కూలీ క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ ఎంట్రీ మాస్ ఆడియన్స్‌కి ఏ రేంజ్ హై ఇస్తుందో చూడాలి!