యస్ ప్రెజెంట్ ఇదే విషయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఈ అంశమే చర్చనీయాంశంగా నిలిచింది. మన అందరికీ తెలిసిందే, త్వరలోనే "వార్ 2" అలాగే "కూలీ" సినిమాలు విడుదల కాబోతున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ "స్పై యూనివర్స్"లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్రాజెక్ట్‌నే ఈ వార్ 2. దీపై బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం దృష్టి పెట్టింది. బిగ్ స్టార్స్ హృతిక్ రోషన్జూనియర్ ఎన్టీఆర్ – కియారా అద్వాని కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ ఎంతో కష్టపడి తెరకెక్కించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కానుంది.


అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద మరో భారీ ప్రాజెక్ట్ "కూలీ" కూడా విడుదల కానుంది. వార్ 2 – కూలీ సినిమాల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు పోటీగా మరో సినిమా లైన్‌లోకి వచ్చింది. ఆ సినిమా మరేదో కాదు — "ధూమ్ కేతు". "వార్ 2" పై ఉన్న క్రేజ్ కంటే డబుల్‌గా ఇప్పుడు ఈ "ధూమ్ కేతు" సినిమాపై హైప్ ఏర్పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో విశేష స్పందన తెచ్చుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ హైలైట్‌గా ఉండబోతోందన్న వార్త మరింత ఆసక్తి రేపుతోంది.



ఈ క్రమంలో వార్ 2లో ఉన్న స్టార్ కాంబినేషన్, యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్లోబల్ మార్కెటింగ్.. అలాగే కూలీ సినిమాకి ఉన్న క్రేజ్ — ఇవన్నీ కూడా "ధూమ్ కేతూ" కారణంగా వెనుకబడిపోతున్నాయంటున్నారు సినీ జనాలు. అంతేకాదు, ఆ బిగ్ స్టార్స్ నటించిన సినిమాలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది ఈ"ధూమ్ కేతు" . ఈ మూవీపైన హై రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ "ధూమ్ కేతు" ఇటీవల తెరకెక్కిన సినిమా కాదు. దాదాపు పది సంవత్సరాల క్రితం షూటింగ్ మొదలుపెట్టుకున్నింది.  2017లో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు. సరిగ్గా ఆగస్ట్ 14న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దాంతో వార్ 2, కూలీ సినిమాలకు ఈ మూవీ గట్టి పోటీ ఇవ్వబోతోంది. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో..!?

మరింత సమాచారం తెలుసుకోండి: