
జూనియర్ ఎన్టీఆర్ పాత్ర సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాల తర్వాత ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. ఇది అభిమానులను కొంత నిరాశపరిచింది. అయితే అది ఫేక్ న్యూస్ అని క్లారిటీ వచ్చేసింది. అసలు విషయమేమిటంటే, సినిమా స్టార్ట్ అయిన 18వ నిమిషంలోనే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందట. హైలెట్ ఏంటంటే .. హృతిక్ రోషన్ ఎంట్రీ కన్నా ఎన్టీఆర్ ఎంట్రీ మరింత అద్దిరిపోతుందట. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కి వచ్చేసరికి ఎన్టీఆర్ అభిమానులు సీట్స్‌లో కూర్చోలేరట . అంతగా గూస్‌బంప్స్ వస్తాయట. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన సీన్స్ స్క్రీన్‌ను కుదిపేస్తాయన్న టాక్ వినిపిస్తుంది.
సెకండ్ హాఫ్‌లో ఎన్టీఆర్–హృతిక్ రోషన్‌ల మధ్య వచ్చే ప్రతి సీన్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుందట. ఏ హీరోని తక్కువ చేయకుండా, ఇద్దరికీ సమానమైన ఫైట్ సీన్స్, స్టాంట్స్ ఇచ్చాడట అయాన్ ముఖర్జీ. వార్ 2కి జూనియర్ ఎన్టీఆర్ కమిట్ అయినప్పటి నుంచి ఆయన నెగటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నారని..బాలీవుడ్ స్టార్స్ ఆయనను డామినేట్ చేస్తారనే రూమర్స్ వచ్చాయి. ఆ వార్తలతో తారక్ ఫ్యాన్స్ కొంచెం ఆందోళన చెందారు. అయితే తాజాగా వస్తున్న టాక్ మాత్రం ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది. ఎన్టీఆర్ - హృతిక్ సీన్స్‌ని ఈక్వల్‌గా తెరకెక్కించారట అయాన్ ముఖర్జీ. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన హైలెట్ పాయింట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.