
"మా నాన్నగారు, మా తాతగారు ఆశీర్వాదాలు నాతో ఉన్నంతవరకు నన్ను ఎవరు ఏమి చేయలేరు" అంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ఈ విధమైన టంగ్‌స్లిప్ వ్యాఖ్యలు చేయరు. కానీ ఈవెంట్‌లో మాత్రం కొంచెం ఓవర్‌గా మాట్లాడారనే కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా, ఒక సీనియర్ హీరోని టార్గెట్ చేస్తూ మాట్లాడాడని ఆ హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాలర్ ఎత్తి మాట్లాడడం, అభిమానులు అరుస్తున్నప్పుడు కొంచెం కోపంగా ప్రవర్తించడం .. ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు నెగిగటివ్‌గా మారిపోయాయి. ఇప్పుడు ఆ స్టార్ హీరో అభిమానులు "వార్ 2" సినిమాను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను నెగిటివ్‌గా ట్రోల్ చేస్తూ, సినిమాకు నెగటివ్ టాక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కొంతమంది "నోటి దూల అంటే ఇదే" అని విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కష్టపడి ఈ సినిమా కోసం వర్క్ చేశారు. అయితే తారక్ కోపంతో చేసిన వ్యాఖ్యల వల్ల ఈ సినిమా కలెక్షన్స్ నష్టపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరైతే, "ఎన్టీఆర్ మాట్లాడిన మాటలే వార్ 2ని తెలుగు ఇండస్ట్రీలో దెబ్బతీసేలా ఉన్నాయి" అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. చూడాలి మరి "వార్ 2" సినిమా ఎలాంటి టాక్ అందుకుంటుందో...?????