
వీటికి తోడు ఇందులో భారీతారాగణం నటించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది టికెట్ల విషయంలో చాలా రచ్చ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. చాలా చోట్ల టికెట్స్ అన్నీ కూడా యాప్స్ లలో బ్లాక్ చేసి థియేటర్లలో బ్లాకులో వేలకు వేల రూపాయలు అమ్ముకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలోని ఒక ఫేమస్ థియేటర్లో మొదటి షో టికెట్లు ధర 4వేల రూపాయలు అమ్ముతున్నట్లు ఒక అభిమాని తెలియజేస్తున్నారు.
రజనీకాంత్ కి వీరాభిమానిగా ఉన్న ప్రభాకర్ తమిళ మీడియాతో మాట్లాడుతూ.. కూలి సినిమా టికెట్లు ధర రూ.600 నుంచి రూ.1000 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.4000 రూపాయలు దాటిపోయి అమ్ముతున్నారని తమలాంటి అభిమానులు సినిమాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. మొదటిరోజు సినిమా చూడాలంటే ఇంతటి రేట్లు పెంచారంటూ ఆవేదనతో తెలియజేశారు. చెన్నైలో అన్ని ఏరియాలోను థియేటర్లలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని తెలిపారు. దీంతో ఈ సినిమా టికెట్ల రేట్ల పైన అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. థియేటర్ యాజమాన్యంతో చేతులు కలిపి ఇలాంటి పనులు చాలామంది చేస్తున్నారంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయంపై అటు తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ పరంగా కూలి సినిమా భారీగానే కలెక్షన్స్ రాబట్టేలా కనిపిస్తోంది.