నిన్న బాక్స్ ఆఫీస్ వద్ద రెండు బడా పిక్ సినిమాలు విడుదలయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం బిగ్ క్లాష్ జరిగిందని చెప్పాలి. ఎన్టీఆర్–హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ "వార్ 2", అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకున్న రజనీకాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన "కూలీ" సినిమాలు ఆగస్టు 14న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశాయి. రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాయి. ఒక సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందో, ఇంకో సినిమాకి కూడా అంతే వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం భారీవ్యత్యాసం కనిపించింది.


జూనియర్ ఎన్టీఆర్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆ కారణంగా "వార్ 2" సినిమా కలెక్షన్ల పరంగా రానిస్తుంది అని భావించారు. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ రాగానే సీన్ రివర్స్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం "వార్ 2" సినిమా హిందీలో 40 కోట్లు, తెలుగులో 30 కోట్లు, తమిళంలో 1 కోటి, ఓవర్సీస్‌లో 15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా 85 నుంచి 90 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ సంఖ్యల దగ్గరలోనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.



"కూలీ" .. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, రజనీకాంత్–శృతిహాసన్–నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ సంపాదించింది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఉన్నా, మిగతా సీన్స్ డైరెక్షన్ బాగుండటం, పాటలు హిట్ కావడంతో సినిమా రన్ బలంగా సాగింది. ట్రేడ్ బిజినెస్ వర్గాల సమాచారం ప్రకారం..  ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్లు దాదాపు 150 కోట్లకు పైగానే వసూలైనట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ రెండు సినిమాలను పోల్చితే "వార్ 2" కలెక్షన్ల పరంగా వెనుకబడింది. మరికొద్ది గంటల్లోనే ఈ రెండు చిత్రాలు తమ అధికారిక ఫస్ట్ డే కలెక్షన్లు ప్రకటించనున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో అభిమానులు, జనాలు ..ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫ్లాప్ అన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. వార్ 2 బిజినెస్ అన్ని భాషల్లో బలంగా కనిపించినా, ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా "వార్ 2" తీరని నిరాసకు గురిచేసింది  అభిమానులు అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: