కోలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా  తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటు ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ , ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మదరాసి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మరి కొంత కాలం లోనే విడుదల కానుంది. ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. శివ కార్తికేయన్ తాజాగా తన నెక్స్ట్ మూవీ కి దర్శకుడిని ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో శివ కార్తికేయన్ తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకట్ ప్రభు ,  శివ కార్తికేయన్ కి ఓ మూవీ కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే శివ కార్తికేయన్ , వెంకట్ ప్రభు దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. వెంకట్  ప్రభు కొంత కాలం క్రితం నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా రూపొందిన కస్టడీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. వెంకట్ ప్రభు ఆఖరుగా కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరో గా రూపొందిన ది గోట్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.మరి వెంకట్ ప్రభు నెక్స్ట్ మూవీ ని శివ కార్తికేయన్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk