కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. ఈయన చాలా కాలం క్రితం కార్తీ హీరో గా ఖైదీ అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ మూవీ ని నడిపించిన విధానానికి గాను లోకేష్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఖైదీ మూవీ ద్వారానే లోకేష్ కి అద్భుతమైన దర్శకుడిగా గుర్తింపు దక్కింది. ఖైదీ సినిమా చివరల ఖైదీ మూవీ కి కొనసాగింపుగా ఖైదీ 2 ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఇప్పటివరకు ఖైదీ 2 మూవీ మాత్రం ప్రారంభం కాలేదు. ఖైదీ సినిమా తర్వాత లోకేష్ చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే మరి కొంత కాలం లోనే ఖైదీ 2 మూవీ ని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఖైదీ 2 మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం లోకేష్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమాకు ఖైదీ సినిమాకు లింకు ఉంటుంది. విక్రమ్ సినిమాలో లాస్ట్ లో సూర్య కనిపిస్తాడు.

ఇక ఖైదీ 2 మూవీ లో కార్తీ హీరో గా కనిపించనుండగా ... సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు , వీరిద్దరి మధ్య ఈ సినిమాలో ఫైట్ ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయినట్లయితే ఈ సినిమాపై అంచనాలు తార స్థాయికి చేరే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఈ సినిమాపై అనేక రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. కొంత కాలం క్రితం ఈ సినిమాలో అనుష్క నటించనున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. మరి ఈ సినిమాలో కార్తీ , సూర్య ఇద్దరూ నటిస్తారా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk