గత రెండేళ్లలో మెగా హీరోల కారణంగా ఇండస్ట్రీకి 400 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయా అంటే..? అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో సగానికి పైగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినవారే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, అల్లు శిరీష్ ఇలా మొత్తం ఎనిమిది మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. వీరి సినిమాలు ప్రతి ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో వీరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక్కటి కూడా హిట్ కాలేకపోయాయి. గత రెండేళ్లలో ఈ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది హీరోలు నటించిన సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. దాంతో దాదాపు 400 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


అయితే, అల్లు అర్జున్ మాత్రం ఇండస్ట్రీని కాపాడినట్టే. ఆయన నటించిన పుష్ప సినిమా వేరే స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసింది. 2023లో చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్, పవన్ కళ్యాణ్–సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్రో, శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా,   ఇలా ఒకటి కాదు రెండు కాదు.. గత రెండేళ్లలో మెగా కుటుంబం నుంచి వచ్చిన దాదాపు అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తుస్సుమని పేలిపోయాయి. దాంతో సోషల్ మీడియాలో ఇదే విషయం హైలైట్ అవుతోంది. ఆ హీరోల ఓవర్ యాక్షన్ కారణంగానే సినిమాలు దొబ్బేశాయ్ అంటున్నారు మెగా హేటర్స్. కొంతమంది అల్లు అర్జున్‌ను మెగా హీరోల లిస్టులోంచి వేరుగా చూపుతున్నారు.

 

ఎందుకంటే, ఈ మధ్య కాలంలో వాళ్ళ మధ్య వచ్చిన గొడవలే. అయినా కూడా ఆయన పుష్పతో వేరే స్థాయిలో రికార్డులు సృష్టించారు. అభిమానులు కూడా అదే విషయాన్ని సోషల్ మీడియాలో చెబుతున్నారు. త్వరలో చిరంజీవి నటించిన విశ్వంభరా, పవన్ కళ్యాణ్ నటించిన ఓజి  సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచే అవకాశం ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. అందుకే మెగా హీరోలు తమ సినిమాల కథలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: