హీరోయిన్ కృతి సనన్ అటు తెలుగు, బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరే. మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అందులో తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇక బాలీవుడ్లోకి జాకి ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ నటించిన హీరోపంతి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అలా ఎన్నో చిత్రాలలో నటించిన తర్వాత పాన్ ఇండియా చిత్రమైన ఆది పురుష్ చిత్రంలో సీత పాత్రలో నటించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ ని రాబట్టలేదు.కృతి సనన్ పాత్రకు పేరు వచ్చింది.


అలా దోచేయ్, రాప్తా, స్త్రీ, లుకచుప్పి, అర్జున్ పాటియాలా, హౌస్ ఫుల్ 4, మిమి, గణపతి, భేదియా తదితర చిత్రాల నటించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటున్న కృతి సనన్ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తుంటుంది. ఏదో ఒక పోస్ట్ తో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.  అయితే తాజాగా హ్యాపీ బర్తడే సిప్స్  అంటూ ఒక పర్సన్ ఫోటోతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం కృతి సనన్ ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఆ వ్యక్తి ఎవరో అంటూ అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు.


అయితే కృతి సనన్ మాత్రం ఆ వ్యక్తి మీద చెయ్యి వేసుకొని బర్తడే విషెస్ చెప్పడంతో మరింత ఆశ్చర్యపోతున్నారు.సిప్స్ అనే వ్యక్తి ఫ్రెండా లేకపోతే బాయ్ ఫ్రెండ్ అనే విషయం మాత్రం తెలియడం లేదంటూ అభిమానులు, నేటిజెన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా కృతి సనన్ చాలామంది హీరోలతో ఎఫైర్ ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ వాటన్నిటిని క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయం పైన ఇస్తుందేమో చూడాలి. కృతి సనన్ నుంచి తెలుగు సినిమా రాక చాలా కాలం అవుతోంది. తెలుగులో మళ్లీ నటించమని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: