
బాహుబలి ఎక్స్ క్లూజివ్ కాంబో రిపీట్..ఆ ఇద్దరు స్టార్స్ మళ్లీ ఒక్క సినిమాలో..ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా!

ముఖ్యంగా బాహుబలి సినిమాకి రాజమౌళి దర్శకత్వం వెన్నెముకలా నిలిచింది. ఏ పాత్రకి ఎవరు సూట్ అవుతారు, ఎక్కడ ఎలా పర్ఫార్మ్ చేయాలి అన్న విషయాన్ని ఆయన అద్భుతంగా అంచనా వేశారు. కథలోని ప్రతి మలుపు, ప్రతి టర్న్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టేలా తీర్చిదిద్దారు. అందుకే బాహుబలి విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రీపీట్ టెలికాస్ట్ అయినా, యూట్యూబ్ క్లిప్స్ అయినా, లేదా పాటలు అయినా జనాలు ఎంతసార్లు చూసినా విసుగు చెందరు. బాహుబలి తర్వాత ప్రభాస్, అనుష్క ఇద్దరూ మరోసారి కలసి నటిస్తే బాగుంటుందనే ఆశతో అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ కాంబినేషన్ మళ్లీ సెట్ కాలేదు. అలాగే ప్రభాస్ – రానా కాంబో కూడా మరోసారి తెరపై కనబడితే చాలా స్పెషల్‌గా ఉంటుంది అన్న అభిమానం ఎప్పుడూ ఫ్యాన్స్‌లో కనిపిస్తుంది.
ఇప్పుడు ఆ కల నిజం కాబోతుందనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా ఫౌజిలో, రానా దగ్గుబాటి కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడని సమాచారం అందుతుంది. ఇప్పటికే ప్రభాస్ లుక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అయ్యాయి. ఆయన గెట్-అప్ చాలా క్లాసీగా, స్టైలిష్‌గా, ట్రెండీగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే కాకుండా ఈ సినిమా కాన్సెప్ట్ పూర్తిగా కొత్తదిగా ఉండబోతుందని, ఇందులో రానా దగ్గుబాటి ప్రభాస్ కి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అంటే బాహుబలి తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఇద్దరు హీరోలు ఒకే తెరపై కలిసి ప్రేక్షకులకు వినోదాన్ని అందించబోతున్నారు. ఇక ఈ వార్త విన్న వెంటనే ఫ్యాన్స్ ఆనందంతో ఫుల్ ఎగ్జైట్మెంట్‌లో మునిగిపోయారు. ఎందుకంటే బాహుబలిలో వీరి కాంబినేషన్ స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారి ఆ అద్భుతమైన ఎనర్జీని, స్క్రీన్ ప్రెజెన్స్‌ని అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. అందుకే ఇప్పుడు ఫౌజి సినిమాలో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిత్రబృందం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోయినా, ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ వినిపిస్తున్న టాక్ ప్రకారం రానా దగ్గుబాటి పాత్రకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అంటున్నారు. నిజంగా ఈ వార్త నిజమైతే, రానా–ప్రభాస్ కాంబినేషన్ మరోసారి తెరపై మెరిసిపోబోతోందన్న మాట.