
ఇప్పటికీ సురేఖ గారి స్వభావం మారలేదు. డబ్బులు ఉన్నప్పుడు, లేకపోయినా ఒకేలా ఉంటారు. ముఖ్యంగా, సురేఖ గారి కారణంగానే మెగాస్టార్‌గా చిరంజీవి ఎదిగాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక విషయం చెప్పకుండానే సురేఖకు పెళ్లి జరిగిందని వార్త గతంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, వాళ్లకు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి, అందులో ఇది కూడా ఒకటి.
ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ, "ఆయన ఓ సినిమా థియేటర్‌లో చూసి ఏడ్చిన అనుభవం"ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ.."ఫస్ట్ టైం నేను థియేటర్లో ఒక సినిమా చూసి ఏడ్చాను, అది శంకరాభరణం. నాకు ఆ సినిమా చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. క్లైమాక్స్‌కు వచ్చేసరికి కన్నీళ్లు ఆగలేదు. ఏడ్చేశాను.. లైట్లు వేసే లోఫు కన్నీళ్లు తుడుచుకోవాలి అనుకుంటున్నాను, కాని చేతిలో కర్చీఫ్ లేదు. పక్కన మంజు భార్గవి తన చీర చెంగును అందించింది. దాంతో కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచాను. అప్పుడే లైట్లు ఆన్ అయ్యాయి. వెంటనే ఆమె చీర కొంగు నా చేతిలో ఉండడం అల్లు రామలింగయ్య కుటుంబం చూశారు. ఆ ఘటన తరువాత మూడు నెలలలోనే సురేఖతో నా పెళ్లి కుదిరింది. బహుశా ఆ రోజున నా చేతిలో మంజు భార్గవి చీర కొంగు ఉన్న సంగతి ఎవరు సురేఖకు చెప్పలేదు అనుకుంటాను" అంటూ చెప్పుకొచ్చారు..!!