బాలీవుడ్ నటీమణులే కాదు ఈ మధ్యకాలంలో సౌత్ నటీమణులు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను స్పష్టంగా చెప్పడంలో వెనకడుగు వేయడం లేదు.ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే వారి బాగోతం బయట పెట్టడానికి రెడీ అవుతున్నారు. అలా ఇప్పటికే ఎంతోమంది నటీమణులు ఇలా క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ నటీమణులు కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు సినిమాల్లోకి రాకముందు ఫేస్ చేసిన అనుభవాలను కూడా చెప్పుకున్నారు.అలా రీసెంట్గా ఓ బ్యూటీ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ హీరోయిన్ తాను సినిమాల్లోకి రాకముందు ఓ వ్యక్తి చేసిన భయంకరమైన పనిని తలుచుకొని చాలా బాధపడింది.ఇక విషయంలోకి వెళ్తే..నటి సుర్విన్ చావ్లా అంటే తెలియని వాళ్ళు ఉండరు.

బాలీవుడ్ లో తోపాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా రాణించిన సుర్విన్ చావ్లా రీసెంట్గా నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సంచలన విషయాలు బయట పెట్టింది.సుర్విన్ చావ్లా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను 9వ తరగతి చదువుతున్న సమయంలో నాకు ఈ దారుణమైన సంఘటన ఎదురైంది.. ఆడుకోడానికి బయటికి వస్తే సైకిల్ మీద వెళ్లే ఓ వ్యక్తి నన్ను పిలిచారు.ఆయన దగ్గరికి నేను వెళ్తున్న సమయంలో ఆయన తన ప్యాంట్ లో నుండి ఏదో తీసి సైకిల్ మీద కూర్చొని హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. అయితే ఆ సమయంలో నా వయసు చిన్నది కాబట్టి ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. కానీ ఆయన చేసే పని విచిత్రంగా అనిపించి ఆయన దగ్గరకు వెళ్లకుండా భయపడ్డాను. అంతే కాదు అట్నుంచి అటే ఇంట్లోకి పరిగెత్తాను.

 అయితే ఆ సమయంలో ఆయన చేసిన పని నాకు తెలియక పోయినప్పటికీ చిన్నతనంలోనే అలాంటి పని చూడడం వల్ల నా మైండ్లో అది బలంగా నాటుకు పోయింది.అప్పటినుండి నాకు ఒక రకమైన భయం కూడా పెరిగింది.. అయితే అమ్మాయిల మనసులో ఇలాంటి సంఘటనలు నాటుకుపోతే వాళ్లు ఎక్కడికి వెళ్లినా మనసులో భయం ఆందోళన రెండు ఉంటాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఓ పేరున్న డైరెక్టర్ తనకి అవకాశం ఇస్తానని చెప్పి రమ్మన్నారు.అలా స్టోరీ విన్నాక ఇంటికి వెళ్లే సమయంలో ఆయన సెండ్ ఆఫ్ ఇద్దామని  నాతో వచ్చారు. ఆ సమయంలో డైరెక్టర్ నన్ను అడ్డగించి ముద్దు పెట్టుకోబోయారు. దాంతో ఆయన చేసే పని ముందుగానే గ్రహించి వెనక్కి నెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సుర్విన్ చావ్లా..

మరింత సమాచారం తెలుసుకోండి: