
కానీ గ్లామర్, స్టార్‌డమ్ వెనుక మనీషా వ్యక్తిగత జీవితం మాత్రం కలతలతో నిండిపోయింది. సినీ కెరీర్‌లో ఉన్నంత కాలం వివిధ సంబంధాల వలన తరచూ హాట్ టాపిక్ అయ్యేది. నానా పటేకర్, వివేక్ ముశ్రన్, వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ వంటి ప్రముఖులతో సహా ఏకంగా 12 మందితో అఫైర్స్ ఉన్నాయనే గాసిప్స్ అప్పట్లో బాలీవుడ్‌లో దుమారం రేపాయి. అయితే ఈ ప్రేమకథల్లో ఏదీ స్థిరపడలేదు. 2010లో నేపాల్‌కు చెందిన వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ను పెళ్లి చేసుకొని స్థిరపడతారని అందరూ భావించారు. కానీ ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. కేవలం రెండు సంవత్సరాలకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నుంచి మనీషా మళ్లీ ఒంటరిగానే జీవిస్తోంది.
అదే సమయంలో క్యాన్సర్ అనే మహమ్మారి కూడా ఈమెను పట్టుకుంది. కానీ తన పట్టుదల, చికిత్సతో ఆ జబ్బును జయించి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం 53 ఏళ్ల వయస్సులోనూ బలంగా, ధైర్యంగా జీవిస్తూ, కొన్ని ప్రత్యేక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెరపై హీరోయిన్‌గా మిలమిలలాడిన మనీషా, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఆమె కథను మరింత భిన్నంగా నిలబెట్టాయి. కెరీర్‌లో స్టార్‌గా వెలుగొందినా.. వ్యక్తిగత జీవితం మాత్రం చేదు అనుభవాలతో మిగిలిపోయింది.