
బిస్కెట్లు, చిప్స్, ప్యాక్డ్ జ్యూస్, ఇన్స్టంట్ నూడిల్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక గ్లూకోజ్, కృత్రిమ స్వీటెనర్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి, ఇది పీసీఓఎస్ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. స్వీట్స్, చాక్లెట్స్, కేక్స్, సోడాలు, మరియు ఇతర చక్కెరతో కూడిన పానీయాలు పీసీఓఎస్ ఉన్నవారికి అస్సలు మంచివి కావు. అధిక చక్కెర వల్ల ఇన్సులిన్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి, ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు దారితీస్తుంది. ఇది పీసీఓఎస్ యొక్క ప్రధాన కారణాల్లో ఒకటి.
వైట్ బ్రెడ్, వైట్ రైస్, పాస్తా వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇవి పీసీఓఎస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. కాబట్టి, వాటికి బదులు బ్రౌన్ రైస్, ఓట్స్, బ్రౌన్ బ్రెడ్ వంటి హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం మంచిది. పీసీఓఎస్ సమస్య ఉన్నవారు రెడ్ మీట్ అంటే పంది మాంసం, గొర్రె మాంసం వంటి వాటిని తగ్గించాలి. వీటిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి.
పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులలో ఐజీఎఫ్-1 (IGF-1) హార్మోన్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను, ఇన్ఫ్లమేషన్ ను పెంచుతుంది. అందువల్ల, పీసీఓఎస్ ఉన్నవారు ఈ ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, హైడ్రోజెనేటెడ్ ఆయిల్స్ లో ఈ రకమైన కొవ్వులు ఉంటాయి. ఇవి పీసీఓఎస్ ఉన్నవారిలో ఇన్ఫ్లమేషన్ ను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తీవ్రం చేస్తాయి.