కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ ప్రస్తుతం జన నాయగన్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా విజయ్ చివరి సినిమా అనే సంగతి తెలిసిందే. విజయ్ మాజీ మేనేజర్, పులి మూవీ నిర్మాత సెల్వ కుమార్ మాట్లాడుతూ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు. పులి మూవీతో తాను భారీగా నష్టపోయానని విజయ్ మేనేజర్ తెలిపారు.

నేను నిర్మాతగా నష్టపోయినా విజయ్ పారితోషికం మాత్రం డబుల్ అయిందని సెల్వ కుమార్ కామెంట్లు చేశారు. పులి సినిమా వల్ల తాను ఆస్తులన్నీ  అమ్ముకోవాల్సి వచ్చిందని ఈరోజు వరకు విజయ్ నుంచి ఓదార్పు లేదని సెల్వ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.పులి సినిమాకు చింబు దేవన్  దర్శకత్వం వహించగా 2015 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

2015 నాటికి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. శ్రీదేవి, హన్సిక,  కిచ్చా  సుదీప్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు విడుదలకు ముందే ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి.  ఈ సినిమా రిలీజ్ స,సమయంలో నిర్మాతలపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

సినిమా కోసం నా 27 సంవత్సరాల కష్టార్జితం ఖర్చు చేశానని సినిమా రిలీజ్ కాదనే ప్రచారం సైతం జరిగిందని  సెల్వ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  తొలిరోజే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందని స్టోరీ, గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయని సెల్వ కుమార్ పేర్కొన్నారు. నా స్థానంలో ఎవరైనా ఉంటే  ఆత్మహత్య చూసుకునేవారని ఆయన తెలిపారు.  ఈ సినిమాకు విజయ్ ఏకంగా 25 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: