బాలీవుడ్ హీరోయిన్స్ ఈమధ్య అన్ని భాషలలో నటించడానికి సిద్ధమవుతున్నారు. కానీ గతంలోనే చాలామంది హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలో కూడా నటించిన వారు ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నేహా ధూపియా కూడా ఒకరు. ఈమె నటుడు అంగద్ బేడీతో ప్రేమలో ఉన్న సమయంలోనే గర్భవతి అయ్యింది. దీంతో వీరు వివాహం 2018 మే 10న  హడావిడిగా జరిగిందని పెళ్లైన ఆరు నెలలకే తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది నేహా ధూపియా. దీంతో ఈ జంట పైన చాలామంది ట్రోలింగ్ కూడా చేశారు. వీరి వివాహమై చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ ఈ విషయం మాత్రం అక్కడక్కడ వినిపిస్తూనే ఉంది.


తాజాగా ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేహా దుఫియా ఈ విమర్శలకు సైతం గట్టి కౌంటర్ వేసినట్టు తెలుస్తోంది. నేహా మాట్లాడుతూ.. అవును నిజమే నేను పెళ్ళికి ముందే గర్భవతి అయ్యాను..అందులో ఎలాంటి తప్పులేదని నా అభిప్రాయం .ఇద్దరం ఇష్టపడే ఒక్కటయ్యం అంటూ తెలిపింది. అలాంటి పరిస్థితులలో ఉన్నది తాను ఒక్కటే కాదని  చాలామంది హీరోయిన్స్ కూడా ఇలాంటి దశను ఎదుర్కొన్నారంటూ తెలిపింది. అందరినీ వదిలిపెట్టి నన్నే టార్గెట్ చేస్తూ  ఉన్నారు అంటూ ఫైర్ అయ్యింది.


అంగద్ తో డేటింగ్ చేసిన కొంత కాలానికి తాను గర్భవతినయ్యానని.. పెళ్లికి ముందు గర్భవతి అవ్వడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఆ సమయంలో తాను మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. కేవలం తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే 72 గంటలలో తాము వివాహం చేసుకున్నామని తెలిపింది. తనకంటే మూడేళ్లు తక్కువ వయసు ఉన్న అంగద్ బేడీతో తాను ప్రేమలో పడి వివాహం చేసుకున్నానని తెలిపింది నేహా దుఫియా. తెలుగులో నటించిన సినిమాల విషయానికి వస్తే తరుణ్ నటించిన నిన్నే పెళ్ళాడుతా అనే చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించగా.. రాజశేఖర్ నటించిన ఒక చిత్రంలో విలన్ గా నటించింది. అలాగే బాలయ్య  పరమవీరచక్ర సినిమాలో కూడా నటించింది. ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పలు చిత్రాలలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: