
కానీ తాజాగా హీరోయిన్ హన్సిక షేర్ చేసిన ఫోటోలను చూస్తే విడాకుల రూమర్స్ నిజమనేలా కనిపిస్తున్నాయి.. వినాయక చవితి సందర్భంగా హన్సిక తన ఇంట్లో వినాయకుడు చవితికి సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. హన్సిక కూడా వినాయకుడిని తన ఇంట్లో చాలా అందంగా డెకరేషన్ చేసి, మరి పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఈ ఫోటోలలో కనిపిస్తోంది. ఈ ఫోటోలు షేర్ చేసిన తరువాత మళ్లీ విడాకుల రూమర్స్ వినిపించేలా చేసినట్లు కనిపిస్తోంది హన్సిక. ఎందుకంటే తన కుటుంబ సభ్యులతో కాని ,తన భర్తతో కాని ఈ పూజలు నిర్వహించలేదు హన్సిక.
కేవలం సింగిల్ గా ఈ పూజలు నిర్వహించినట్లు కనిపిస్తోంది. వీటికి తోడు హన్సిక మెడలో మంగళసూత్రం లేకపోవడం, నుదిటిన సింధూరం వంటివి లేకపోవడంతో ఈ రూమర్స్ కు మరింత బీజం వేసినట్టుగా కనిపిస్తోంది. సాధారణంగా హిందూ స్త్రీలు కానీ సెలబ్రిటీలు కానీ ఇలా పండుగ పూటలో ఎప్పుడు ఇలా కనిపించరు. ఇప్పుడు హన్సిక కనిపించడంతో ఈ విషయం చర్చనీయంశంగా మారింది. అంతేకాకుండా గతంలో తన భర్త నుంచి ,కుటుంబ సభ్యుల నుంచి దూరంగానే ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.. మరి ఈ విషయం పైన అటు హన్సిక ఎలా స్పందిస్తుందో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమాలలో కూడా ఈ మధ్య పెద్దగా కనిపించలేదు హన్సిక.