యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను యువ‌ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించగా, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది... తేజ సజ్జా ఇందులో ఓ సూపర్ యోధుడి పాత్రలో కనిపించనుండటంతో అభిమానుల్లో ఉత్సుకత మరింతగా పెరిగింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, గ్లింప్స్ సినిమాపై అద్భుతమైన హైప్ క్రియేట్ చేశాయి. ‘హనుమాన్’తో ఒకే దెబ్బకు వంద కోట్ల క్లబ్ హీరోగా మారిన తేజ సజ్జా, ఇప్పుడు ‘మిరాయ్’తో ఆ హవాను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నాడు.


సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం రూ.24.5 కోట్లు చేసింద‌ని టాక్ ? తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్లు కలిపి ఈ డీల్ సాలిడ్‌గా క్లోజ్ కావడం విశేషం. ఈ మొత్తాన్ని వసూలు చేయడం తేజ సజ్జా క్రేజ్ దృష్ట్యా పెద్ద కష్టం కాదని, పైగా బయ్యర్లకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..
ఏరియాల వారీగా మిరాయ్ బిజినెస్ ఇలా ఉంది
...


యూఎస్ మార్కెట్ - రూ.4.5 కోట్లు,
ఆంధ్ర - రూ.8 కోట్లు,
నైజాం - రూ.7 కోట్లు,
సీడెడ్ - రూ.3 కోట్లు,
కర్ణాటక - రూ.2 కోట్లు
మ‌రి సెప్టెంబ‌ర్ 12న రిలీజ్ అవుతోన్న మిరాయ్ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ?  చూడాలి. .


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి ..

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: