సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క డైరెక్టర్ కి హీరోకి నిర్మాత కి హీరోయిన్ కి మధ్య పోటీ అనేది కచ్చితంగా ఉంటుంది.ముఖ్యంగా హీరోల మధ్య హీరోయిన్ల మధ్య పోటీ తత్వం ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం. సినిమాల పరంగా పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వాళ్ళందరూ మంచి మిత్రులు గానే ఉంటారు.కానీ ఇవేవీ తెలియని కొంతమంది ఫ్యాన్స్ కావాలనే వీరి మధ్య చిచ్చులు పెట్టిస్తూ ఉంటారు. కానీ హీరోల కోసం అభిమానులు కొట్టుకు చస్తూ ఉంటే హీరోలు మాత్రం ఒకే దగ్గర ఉంటూ తమ మధ్య గొడవలు ఏమీ లేవు అని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుండి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు ఎంతలా చక్కర్లు కొడుతున్నాయో చెప్పనక్కర్లేదు.

ఇక దొరికిందే సందు అని కొంతమంది మెగా, అల్లు ఫేక్ భిమానులు వీరి మధ్య ఏదో ఒక చిచ్చు పెట్టే విధంగా పోస్టులు చేస్తూ ఉంటున్నారు. అయితే తాజాగా ఈ దిక్కుమాలిన ఫ్యాన్స్ రాజకీయాలకు అల్లు ఫ్యామిలీ,మెగా ఫ్యామిలీ చెక్ పెట్టేసింది.రీసెంట్ గా అల్లు అరవింద్ తల్లి అల్లు కనక రత్నమ్మ మరణించడంతో మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు ఇంట్లోనే కనిపించింది.అల్లు కనక రత్నమ్మ మరణ వార్త వినడంతోనే చిరంజీవి వెంటనే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆ టైంలో అల్లు అరవింద్ ఇంట్లో లేరు. విషయం తెలియడంతోనే అరవింద్ కూడా ఇంటికి బయలుదేరారు. అలాగే సినిమా షూటింగ్స్ లో ఉన్న అల్లు అర్జున్, రామ్ చరణ్ లు కూడా హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు.

ఇక ఇంటికి వచ్చాక చిరంజీవి అల్లు అర్జున్ మాట్లాడుకోవడం,అల్లు అర్జున్ రామ్ చరణ్ లు హగ్ చేసుకోవడం,మాట్లాడుకోవడం వరుణ్ తేజ్ రావడం ఇలా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఈ వీడియోలన్నీ చూస్తే వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ సేనతో సేనాని అనే సభ ఉండడం వల్ల అల్లు కనకరత్నమ్మ చివరి చూపుకు రాలేకపోయారు. కానీ ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకొని ఇంటికి కూడా వెళ్లకుండా మొదట అల్లు అరవింద్ ఇంటికే వెళ్లారు.

 అలా పవన్ రావడంతోనే బన్నీ ఆప్యాయంగా హగ్ చేసుకొని రిసీవ్ చేసుకోవడం,అల్లు అరవింద్,బన్నీ,పవన్ కలిసి మాట్లాడుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హైలెట్గా నిలిచాయి. ఇక ఈ ఒక్క విషయంతో ఈ రెండు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు కానీ బంధుత్వాలని మాత్రం ఎవరూ వదులుకోలేరు.. కష్టం వస్తే ఫ్యామిలీ మొత్తం ఒక్కటే అని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి అని,ఇప్పటికైనా ఈ దిక్కుమాలిన ఫ్యాన్స్ రాజకీయాలను తగ్గించుకుంటే మంచిది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: