
మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సోదర భావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక
చిరంజీవి తన సోదరుడు పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటో షేర్ చేస్తూ శుభాకాంక్షలు అందించారు.
"చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
ప్రజా జీవితంలో జనసేనానిగా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ! " అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ తో చిరంజీవి షేర్ చేసిన ఫోటో కూడా ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇక మెగా బ్రదర్స్ సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నెల 25న గ్యాంగ్ స్టర్ కథాంశాంతో తెరకెక్కిన ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చిరు సంక్రాంతికి మన శంకరవర ప్రసాద్ గారు, సమ్మర్‌లో విశ్వంభర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు