సహాయం అనేది ఎల్లప్పుడూ డైరెక్ట్‌గా చేయాల్సిన పనిలేదు. కొన్ని సందర్భాల్లో, మనం చేసిన సహాయం వారికి తెలియకపోయినా, అది వారికి చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అలాంటి ఒక ప్రత్యేకమైన మూమెంట్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా అది ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు టాప్ హీరోస్ మ్యాటర్ కావడంతో, మరింత వైరల్‌గా మారింది. మహేష్ బాబు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ సూపర్ స్టార్. ప్రస్తుతానికి ఆయన రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే, ఇక ఆయన గ్లోబల్ హీరో స్థాయి చేరుకుంటాడు.
 

అంతే కాక, అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.  “పుష్ప 2” సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి, ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే, ఆయనకు కూడా గ్లోబల్ ఇమేజ్ దక్కుతుంది. అల్లుఅర్జున్ ఇంత పెద్ద హీరో అవ్వడానికి పరోక్షంగా కారణమయ్యాడు మహేష్ బాబు అని అభిమానులు చెబుతున్నారు. ఎక్కువగా, మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలు అల్లు అర్జున్‌కు అవకాశాలు తెచ్చాయి. “ఆర్య” సినిమా ఆ రిలేషన్‌లో కీ రోల్ ప్లే చేసింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ వేరే లెవెల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.



అందులో హీరోబన్నీ వన్ సైడ్ లవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని ఇచ్చింది. నిజానికి సుకుమార్ ఈ సినిమాను మహేష్ బాబుతో చేయాలనుకున్నారట.  కథ కూడా ఆయనకు వివరించారట. కానీ మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో, ఈ సినిమా అల్లు అర్జున్ ఖాతాకు చేరింది. ఒకవేళ మహేష్ బాబు ఆ రోజు ఓకే చేసేవాడే అయితే, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వకపోయేదేమో. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ స్థాయిలో స్టార్ కచ్చితంగా అవ్వకపోయేవాడే అంటున్నారు జనాలు. "ఆర్య" సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో  ఎప్పటికీ మర్చిపోలేని హిట్. పుష్ప ప్రమోషన్ ఈవెంట్స్‌లో కూడా బన్నీ ఇదే విషయాన్ని చెప్పారు. “సుకుమార్ లేకపోతే అల్లు అర్జున్ అనే హీరో అసలు ఇండస్ట్రీలో ఎదగేవాడే కాదు” అని ఎమోషనల్ అయ్యారు. అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఫ్యాన్స్ ఇప్పుడు “మహేష్ బాబు రుణం తీర్చుకోలేడు, అల్లు అర్జున్” అంటూ సరదాగా ఈ విషయాని వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: