ఇప్పుడు ఎక్కడ చూసినా హీరోయిన్ అనుష్క నటించిన "ఘాటీ" సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. మనందరికీ తెలిసిందే, అనుష్కకు రిస్క్‌లు చేయడం అంటే చాలా ఇష్టం. గతంలో ఆమె సినిమాల విషయంలో ఎన్నో రిస్క్‌లు తీసుకుంది అన్నది అందరికీ తెలిసిందే. బహుశా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఇంతటి రిస్క్‌లు చేసిన దాఖలాలు లేవు. అనుష్క బ్యాక్ టు బ్యాక్ తన సినిమాల విషయంలో రిస్క్‌లు చేస్తూనే వస్తోంది. ఘాటీ విషయంలో కూడా అలాంటి రిస్క్ తీసుకుంది. అనుష్కలాంటి సాఫ్ట్ హీరోయిన్ కత్తితో తల నరికే సీన్స్ చేయడం చూసినప్పుడే జనాలు “ఈ సినిమాలో ఏదో ఉంది” అంటూ మాట్లాడుకున్నారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. “అనుష్క ఇంత వైల్డ్ యాంగిల్‌లో కనిపించడమా? మనసు అంగీకరించడం లేదు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. “ఈ సినిమాలో అనుష్క చాలా బోల్డ్‌గా, క్రూరంగా నటించింది” అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.


ఇలాంటి రిస్క్ మూవీ అసలు అనుష్క చేతికి ఆఫర్ ఎలా వచ్చింది అని జనాలు చర్చించుకుంటున్నారు. నిజానికి క్రిష్ ఈ సినిమాను అనుష్కతో చేయాలని మొదట అనుకోలేదట. ఈ సినిమాను ముందుగా సూపర్ స్టార్‌ హీరోయిన్ నయనతారతో చేయాలనుకున్నారట. ఆమె ఇంటికి వెళ్లి స్టోరీ కూడా వివరించారట. ఆ స్టోరీ విన్న నయనతార, “ఇంత వైలెన్స్ ఉన్న సినిమాల్లో నటించలేను” అంటూ ఓపెన్‌గా చెప్పేసిందట. అంతేకాదు, “ముసలిదానిలా ఆ చీరలు ఏమిటి? ఆ కట్టు బొట్టు ఏమిటి?” అంటూ క్రిష్ దర్శకత్వాన్ని కూడా ఎగతాళి చేసిందనే న్యూస్ మీడియాలో వైరల్ అయింది.



నిజానికి నయనతారసినిమా చేసుంటే అస్సలు హిట్ అయ్యేది కాదని అంటున్నారు జనాలు. “అనుష్కనైనా కొంత కాలం ఇలాంటి పాత్రలు చేసి రాణించగలిగింది. నయనతార చేసుంటే సినిమా స్టార్టింగ్‌లోనే థియేటర్ నుంచి బయటకు వచ్చేసేవారు” అని కామెంట్లు చేస్తున్నారు. ఘాటీ సినిమా రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ వచ్చింది. కానీ అనుష్క ప్రత్యక్షంగా ప్రమోషన్లలో పాల్గొనలేదు. పరోక్షంగా కొన్ని ఇంటర్వ్యూలలో ఫోన్ కాల్ ద్వారా మాత్రమే సినిమాకు ప్రమోషన్ చేసింది. అయినా సరే సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు, ఫ్యాన్స్ మాత్రం ఆమె కోసం థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: