కోలీవుడ్ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ తాజాగా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఇక ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి పెద్ద స్థాయి కలెక్షన్లు ఓపెనింగ్ డే రోజు దక్కలేదు. ఆ తర్వాత కూడా ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు దక్కడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఐదు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తే హిట్టు స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఐదు రోజుల్లో ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో 40.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.95 కోట్లు , కర్ణాటక ఏరియాలో 4.75 కోట్లు , కేరళ లో 1.55 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 లక్షలు , ఓవర్ సిస్ లో లో 22.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ సినిమాకు ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 36.70 కోట్ల షేర్ ... 74 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 81 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 44.30 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk