ఈ వారం భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన తెలుగు చిత్రం `మిరాయ్‌`. యంగ్ అండ్ టాలెంటెడ్ తేజ స‌జ్జా హీరోగా న‌టించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌కుడు. మంచు మ‌నోజ్ విల‌న్ గా యాక్ట్ చేశాడు. రితిక నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. ఇతిహాసాలను బేస్ చేసుకుని వచ్చిన ఈ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అటు మాస్ తో పాటు ఇటు క్లాస్ ఆడియెన్స్ ను కూడా మెప్పించేలా సినిమా ఉంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.


అద‌లా ఉంటే.. మిరాయ్ విష‌యంలో ఓ విష‌యం సినీ ప్రియుల‌ను ఎంత‌గానో నిరాశ ప‌రిచింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాలో రెండు అద్బుతమైన సాంగ్స్ ను మేకర్స్ కట్ చేసేశారు. అందులో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసిన `వైబ్ ఉంది బేబీ` సాంగ్‌. విడుద‌లకు ముందు యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఆ పాట‌కు విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇందులో తేజ‌, రితిక డ్యాన్స్ స్టెప్పులు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.


అయితే ఈ పాట‌తో పాటు ప్ర‌ముఖ స్టార్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించిన స్పెషల్ సాంగ్ ను కూడా మేక‌ర్స్ క‌ట్ చేసేశారు. ఈ విష‌యం కొంచెం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ట్రైన్ సీన్స్ వచ్చేటప్పుడు నిధి స్పెష‌ల్‌ సాంగ్ ను మొద‌ట‌ ప్లాన్ చేశార‌ట‌. థియేట‌ర్స్ లో ఫ్యాన్స్ మ‌రియు ఆడియెన్స్ ను స‌ర్‌ప్రైజ్ చేసేందుకు నిధి సాంగ్ మ్యాట‌ర్‌ బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు కూడా తీసుకున్నారు. కానీ ఫైన‌ల్ క‌ట్ లో కథ, స్క్రీన్ ప్లే డిస్టర్బ్ అవుతాయ‌నే కార‌ణంతో `వైబ్ ఉంది బేబీ` సాంగ్ తో పాటు నిధిపై షూట్ చేసిన స్పెష‌ల్ సాంగ్ ను కూడా తొల‌గించారు. ఓటీటీలో అయినా యాడ్ చేసి రిలీజ్ చేస్తారా అంటే అదీ డౌటే అంటున్నారు. దీంతో నిధి అగ‌ర్వాల్ ను డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని మోసం చేశారంటూ ఆమె ఫ్యాన్స్ ర‌గిలిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: