దివంగత నటి సౌందర్య తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె మరణాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు.. సౌందర్య తో అప్పటి జనరేషన్ హీరోయిన్లు ప్రతి ఒక్కరూ చాలా సన్నిహితంగా మెదిలేవారు. ముఖ్యంగా ఆమని,మీనా, రమ్యకృష్ణ వంటి హీరోయిన్లు సౌందర్య మరణాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మనం అనేకం చూసాం. ఇక ఆమని అయితే ఓ ఇంటర్వ్యూలో ఆ దేవుడు సౌందర్యను ఉంచి నన్ను తీసుకుపోయినా బాగుండు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అలాంటి దివంగత హీరోయిన్ సౌందర్య గురించి చనిపోయినా కూడా ఇప్పటికే ఆమె గురించి ఎన్నో తెలియని విషయాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బయటపడుతూ ఉంటాయి. అలా తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ సౌందర్యకు సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.మరి ఇంతకీ ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరయ్యా అంటే ఫ్లోరా షైనీ.. 

ఫ్లోరా షైనీ అనే పేరు కంటే ఎక్కువగా ఆశా షైనీ అనే పేరుతోనే ఈ నటి ఎక్కువ ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలోని లక్స్ పాప అనే పాటతో అప్పట్లో వైరల్ అయిన ఫ్లోరా షైనీ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆశా పేరుతో ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది.అయితే అలాంటి ఫ్లోరో షైనీ తాజాగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి ఫ్లోరా షైనీ సౌందర్య గురించి చెబుతూ.. సౌందర్య గారితో నేను సర్దుకుపోదాం రండి అనే సినిమా చేశాను. అయితే సౌందర్య గురించి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అదేంటంటే సౌందర్య గారు సినిమాలు చేస్తే షూటింగ్ లొకేషన్లలో హోటల్ గదిలో ఉండడం కంటే గెస్ట్ హౌస్ లలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది.

ఎక్కడ షూటింగ్ జరిగినా కూడా హోటల్ లో బస చేసే కంటే గెస్ట్ హౌస్ లనే ఎక్కువగా ఎంచుకుంటుంది. ఈ విషయం సౌందర్యతో కలిసి సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే సర్దుకుపోదాం రండి సినిమా చేసిన సమయంలో సౌందర్య గారితో పాటు నేను కూడా గెస్ట్ హౌస్ కి వెళ్లాను. నేను జూనియర్ అయినా కూడా సౌందర్య గారు నాతో చాలా సత్ప్రవర్తనతో మెదిలారు. అలాగే నేను సీనియర్ ఆమె జూనియర్ అనే విధంగా అస్సలు ప్రవర్తించరు. సౌందర్య గారి వల్లే నేను కూడా నా కంటే లేటుగా వచ్చిన జూనియర్స్ తో ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకున్నాను. సౌందర్య సెట్లోకి వస్తుందంటే చాలు అక్కడంతా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంటూ సౌందర్యతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొని ఎమోషనల్ అయింది నటీ ఫ్లోరా షైనీ.

మరింత సమాచారం తెలుసుకోండి: