కొన్ని సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీ లో విడుదల అయిన సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో ఆ రేంజ్ విజయాన్ని సినిమాలు అందుకునేవి. ఉదాహరణకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటే , సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు సూపర్ హిట్ రేంజ్ లో , యావరేజ్ ట్రాకు వచ్చిన సినిమాలు యావరేజ్ రేంజ్ లో కలక్షన్లను వసూలు చేసేవి. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి. కొంత కాలం క్రితం నారా రోహిత్ "సుందరకాండ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే.

మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాతో నారా రోహిత్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటాడు అని చాలా మంది అనుకున్నారు. ఇక ఈ మూవీ కి మొదటి రోజు పర్వాలేదు అనే స్థాయి ఓపెనింగ్లు ఆ తర్వాత ఎందుకో ఈ సినిమా కలెక్షన్లు చాలా వరకు పడిపోయాయి. దానితో నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ దక్కిన కూడా ఆ స్థాయి విజయాన్ని మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ఈ సినిమా అందుకోలేకపోయింది. 

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్న ఆ స్థాయి కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయిన సుందరకాండ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా సెప్టెంబర్ చివరి వారంలో ఈ మూవీ ని జియో హాట్ స్టార్ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nr