కోలీవుడ్ నటుడు విజయ్ తలపతి తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరో ఆరు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో విజయ్ తలపతి నిలబడబోతున్నారు.అలాగే ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా తమిళ వెట్రి కళగం అనే పార్టీ ని స్థాపించారు.అలా ప్రస్తుతం రాజకీయాల్లో దూసుకుపోతున్న విజయ్ తాజాగా తిరుచ్చి నుండి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.ఈ నేపథ్యంలోనే విజయ్ కి సంబంధించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే విజయ్ తన ప్రచార వాహనానికి కూడా తన సెంటిమెంట్ నెంబర్ ని రిపీట్ చేశారట.మరి ఇంతకీ ఆ సెంటిమెంట్ నెంబర్ ఏంటి.. దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.విజయ్ తాజాగా తిరుచ్చి నుండి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. 

ఈ నేపథ్యంలోనే తన ఎన్నికల ప్రచార వాహనానికి ఉన్న నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఆ నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అని చాలామంది సెర్చ్ చేస్తున్నారు. ఇక విజయ్ ప్రచార వాహనానికి ఉన్న ఆ నెంబర్ ఏంటి అంటే 0277.. ఇక తమిళనాడు రాష్ట్రం కాబట్టి తమిళనాడులోని వాహనాలు అన్నింటికీ TN 14 అనే నెంబర్ కామన్ గానే ఉంటుంది.ఆ తర్వాత వచ్చే అంకెలే మారుతూ ఉంటాయి. అయితే విజయ్ తన దగ్గర ఉండే ప్రతి ఒక్క వాహనానికి చివర్లో 0277 ఉండేలా చూసుకుంటారు. అయితే దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి అంటే విజయ్ కి ఒక సోదరి ఉండేదట. కానీ ఆమె చిన్నతనంలోనే మరణించిందట.ఇక తన విజయ్ సోదరి 1977 ఫిబ్రవరి 14న జన్మించిందట. కానీ పుట్టిన కొన్ని సంవత్సరాలకే అనారోగ్య సమస్యలతో 1984లో మరణించిందట. ఇక సోదరి మరణించినప్పటి నుండి విజయ్ చాలా బాధపడ్డారట.

చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. అందుకే సోదరి మరణాన్ని మర్చిపోలేక సోదరి పుట్టిన మంత్,ఇయర్ కలిసేలా ఉండే నెంబర్ ని తన వాహనాలకి నెంబర్ ప్లేట్లుగా పెట్టుకునేవారు. అలా తన దగ్గర ఉన్న కార్లు,బండ్లకు కూడా ఇదే నెంబర్ ని రిపీట్ చేశారు. అలా తాజాగా తన ఎన్నికల ప్రచార బస్సుకి కూడా అదే నెంబర్ ని పెట్టుకున్నారు.అంతేకాకుండా తన సోదరి విద్యా పేరుకి గుర్తుగా తన కూతురికి దివ్య అని పెట్టుకున్నారు అంటూ ఓ ఇంటర్వ్యూలో విజయ్ తల్లి చెప్పింది. అలా సోదరి జన్మించిన సంవత్సరానికి సంబంధించిన డేట్ ని తన ప్రతి వాహనానికి సంబంధించిన నెంబర్ ప్లేట్లలో విజయ్ రిపీట్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: