
"మిరాయ్"లో తేజ సజ్జ యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేసి పండించిన పెర్ఫార్మెన్స్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. హీరోయిన్ రితికా నాయక్ ఫ్రెష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించింది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన గౌరహరి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మూడ్ సెట్ చేశారు. మరో వైపు మంచు మనోజ్, శ్రియ శరణ్ సాలిడ్ రోల్స్ చేసి సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చారు. "మిరాయ్" విజయానికి ముఖ్యమైన కారణం – దాని టెక్నికల్ స్టాండర్డ్స్. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. దీనికి తోడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీగా నిర్మించడం వల్ల సినిమాకు రిచ్ లుక్ వచ్చింది.
ఇక బాలయ్య, మోక్షజ్ఞ స్క్రీనింగ్ తర్వాత బయటికి వచ్చినప్పుడు సంతోషంగా కనిపించడం, వారిద్దరూ సినిమా టీమ్‌ను ప్రశంసించారనే సమాచారం ఇండస్ట్రీలో హైలైట్ అవుతోంది. బాలయ్య మోక్షజ్ఞను తరచూ సినిమాల వద్దకు తీసుకువెళ్లడం, స్పెషల్ స్క్రీనింగ్స్‌లో భాగస్వామ్యం చేయించడం ద్వారా ఆయనను నెమ్మదిగా సినీ పరిసరాలకు అలవాటు చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. మొత్తానికి, "మిరాయ్" ఇప్పటికే విజయవంతమైన చిత్రమే కానీ బాలయ్య, మోక్షజ్ఞ ప్రైవేట్ స్క్రీనింగ్ వార్తలు వెలువడటంతో మూవీకి మరింత పాజిటివ్ హైప్ వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.