ఒక సినిమా అనుకున్న దాని కంటే పెద్ద హిట్ అయితే ఆ నిర్మాత ఆనందం మాటల్లో చెప్పలేనిది.. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు యావరేజ్ గానే ఆడుతున్నాయి. ఏ సినిమాలు కూడా నిర్మాత కి కలెక్షన్ల వర్షాన్ని కురిపించడం లేదు. కానీ మిరాయ్ మూవీ చిన్న సినిమా గా వచ్చి అతి పెద్ద హిట్ అయింది.. బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఐదు రోజులకే 100 కోట్ల కలెక్షన్ల ను అందుకోవడంతో తాజాగా  చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించుకున్నారు.. ఈ సక్సెస్ మీట్ లో భాగంగా నిర్మాత సంతోషంతో ఉప్పొంగిపోతూ హీరో కి డైరెక్టర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానని కూడా ప్రకటించారు... మరి ఇంతకీ నిర్మాత హీరో డైరెక్టర్ కి ఇవ్వబోయే ఆ గిఫ్ట్ ఏంటయ్యా అంటే వాళ్ళు కోరుకున్న కారు.. 

అవును మీరు వినేది నిజమే.. తాజాగా మిరాయ్ మూవీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సినిమా హిట్ కి కారణమైనటువంటి డైరెక్టర్ కి, హీరో కి వాళ్ళు కోరుకున్నటువంటి కారు ని బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఇక నిర్మాత ప్రకటన తో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని ఇద్దరు చాలా సంతోషించారు. అయితే సినిమా అనుకున్న దాని కంటే ఎక్కువ హిట్ అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నిర్మాతలు తమ హీరోలకు, డైరెక్టర్లకు లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చే ట్రెండ్ నడుస్తోంది.

అలా జైలర్ మూవీ విడుదలైనప్పుడు నిర్మాత హీరోకి,డైరెక్టర్ కి లగ్జరీకారులను బహుమతిగా ఇచ్చారు. అలాగే బేబీ మూవీ విడుదలైనప్పుడు కూడా నిర్మాత డైరెక్టర్ కి లగ్జరీ కార్ బహుమతిగా ఇచ్చారు.అలా తాజాగా అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయినా మిరాయ్ మూవీ డైరెక్టర్ కి, హీరో కి వాళ్ళు ఇష్టపడిన కార్లను బహుమతిగా ఇస్తానని నిర్మాత ప్రకటించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: