సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద రాధాంతాలుగా మారిపోతున్నాయి. ఒక చిన్న ఇష్యూ జరిగినా దానిని కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాలో మరీ ఎక్కువగా రియాక్ట్ అవుతూ, రెండు వర్గాల మధ్య తలనొప్పిగా మార్చేస్తున్నారు. దానికి తాజాగా మరొక క్లాసిక్ ఉదాహరణగా నిలిచింది దీపికా పదుకొనే వివాదం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను టాలీవుడ్ ఇండస్ట్రీలో అవమానిస్తున్నారని ఇప్పుడు బాలీవుడ్ వర్గాల అభిప్రాయం. కారణం ఏమిటంటే—ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ "కల్కి 2" నుంచి దీపికాను తొలగించడమే. రీసెంట్‌గా ఈ విషయంపై మూవీ మేకర్స్ అఫీషియల్ ప్రకటన చేశారు. సినిమా నుంచి ఆమెను తప్పిస్తున్నట్లు అనౌన్స్ చేసిన వెంటనే బాలీవుడ్ జనాలు తీవ్రంగా మండిపడ్డారు. "మా హీరోయిన్‌కు తెలుగు ఇండస్ట్రీ అవమానం చేసింది" అంటూ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.


అంతటితో ఆగకుండా ఈ విషయం ఇప్పుడు నార్త్ వర్సెస్ సౌత్ అనే స్థాయికి వెళ్లిపోయింది. "సౌత్ ఇండస్ట్రీకి నార్త్ హీరోయిన్స్‌పై ఎప్పటినుంచో చులకన భావన ఉంది. వాళ్లని ఎప్పుడూ తక్కువగానే చూస్తారు" అంటూ సోషల్ మీడియాలో కోపంగా రియాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, దీపికాను కావాలనే తొక్కేస్తున్నారని, టాలీవుడ్ వాళ్లు బాలీవుడ్ స్టార్స్‌ని పట్టించుకోరని ఆరోపిస్తున్నారు.కానీ నిజానికి అసలు విషయానికి వస్తే—దీపికా పదుకొనే కొన్ని వ్యక్తిగత కోరికలు, కండీషన్స్ ఫిల్ చేయలేకపోవడంతోనే ఆమెను మూవీ నుంచి తప్పించారని ఇండస్ట్రీ టాక్. కానీ జనాలకు ఈ రియాలిటీ అర్థం కాకుండా వేరేలా అర్థం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా దీపిక ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఇకపై ఎలాంటి బాలీవుడ్ స్టార్ కూడా తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయకూడదు. తెలుగు సినిమాలను కూడా మేము చూడం" అని ఘాటుగా స్పందిస్తున్నారు.



చిన్నగా ముగిసే మనస్పర్థలు ఇప్పుడు పెద్దగా మారి, రెండు ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టేలా పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియాలో వస్తున్న ఘాటు కామెంట్స్ చూస్తుంటే ఈ ఇష్యూ ఇంతలోనే ఆగిపోదని, ఎక్కడికో దారి తీయబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది. బాలీవుడ్ వర్గాలు కూడా ఈ ఇష్యూని అంత సులభంగా వదలబోవడం లేదు.ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక మార్గం—దీపిక కూల్‌గా, పాజిటివ్‌గా స్పందించడం. లేకపోతే ఈ చిన్న ఇష్యూ పెద్ద దెబ్బతీసే అవకాశముంది. ఇండస్ట్రీల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటే, అది ఇరువైపులా నష్టమే అవుతుంది. అందుకే ఎవరో ఒకరు ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ఈ ఇష్యూ ఎక్కడికి వెళ్తుందో ఊహించడం కూడా భయంకరంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: