
దానికి కారణం సందీప్ రెడ్డి వంగా తీస్తున్న “స్పిరిట్” సినిమా అని చాలామంది ఫిక్స్ అయ్యారు. దీపికా పదుకొనేను సినిమా నుంచి తప్పిస్తున్నామని మూవీ మేకర్స్ చేసిన పోస్ట్‌కి సందీప్ రెడ్డి వంగా రిప్లై ఇవ్వడం వల్ల హీట్ ఇంకా పెరిగింది. దీపికా పదుకొనే లాంటి గ్లోబల్ స్టార్‌ని కూడా ఇలా తప్పిస్తే, ఇక మిగతా హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే స్టార్ హీరోయిన్స్ అలర్ట్ అయ్యారు. కేవలం దీపికా మాత్రమే కాదు, చాలామంది హీరోయిన్స్ షూటింగ్ స్పాట్స్‌కి ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్‌ని పిలిపించుకొని టైమ్ పాస్ చేస్తూ, వాటి ఖర్చులు మొత్తం మూవీ మేకర్స్ మీద వేస్తుంటారు. దీపికా మొదటి హీరోయిన్ కాదు. అయితే ఇప్పుడే ఎందుకు ఈ ఇష్యూ హైలైట్ అయ్యిందనేది పక్కన పెడితే, మిగతా స్టార్ హీరోయిన్స్ మాత్రం దీపిక విషయంలో తీసుకున్న నిర్ణయం చూసి షాక్ అయ్యి, ఇకపై షూటింగ్ స్పాట్స్‌కి ఫ్రెండ్స్, రిలేటివ్స్‌ని పిలిపించుకోకూడదని, ఓవర్ యాక్షన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా టాప్ రేంజ్‌లో ఉన్న హాట్ బ్యూటీస్, హై రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ ఎక్కువగా ఇలాంటివి చేస్తారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడు వారు కూడా అలర్ట్ అయ్యారని, ఇకపై షూటింగ్ స్పాట్స్‌కి ఫ్రెండ్స్, రిలేటివ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తం మీద, దీపికా పదుకొనే విషయంలో మూవీ మేకర్స్ తీసుకున్న నిర్ణయం మిగతా హీరోయిన్స్‌కి పెద్ద హెచ్చరికగా మారింది. మరోవైపు మూవీ మేకర్స్ మాత్రం ఈ పరిణామాలతో సంతోషంగా ఉన్నారు. కనీసం ఇక్కనైనా హీరోయిన్స్ మారి, టైమ్‌కి షూటింగ్‌కి హాజరై, కాల్‌షీట్స్ పూర్తి చేసి, సినిమాలు త్వరగా పూర్తిచేస్తే, ప్రొడ్యూసర్స్‌కు కూడా ఖర్చులు తగ్గుతాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నాయి.