టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన టీజీ. విశ్వప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థకు 2024లో రూ. 140 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని ఇది మా కెరియర్లో అతిపెద్ద నష్టంగా నిలిచిందని తెలియజేశారు. ఇదంతా కూడా కేవలం ఆరు చిత్రాల నిర్మాణం వల్లే జరిగిందని కూడా తెలిపారు. ఇందుకు ముఖ్య కారణం ఓటిటి మార్కెట్లో కనిపించిన మార్పులే అంటూ తన అభిప్రాయంగా తెలిపారు విశ్వప్రసాద్. వాటి గురించి పూర్తిగా వివరించారు.



2021-2023 మధ్యకాలంలో నాన్ థియెట్రికల్ హక్కులకు చాలా డిమాండ్ ఉండేది. కానీ 2024 వచ్చేసరికి ఓటిటి డిమాండ్ చాలా తగ్గడంతో నాన్ థియేటర్ల హక్కులు కూడా అమ్ముడుపోయే విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని వీటి వల్లే నష్టం వచ్చిందంటూ  తెలిపారు. ఈగల్, మనమే, స్వాగ్, విశ్వం, మిస్టర్ బచ్చన్, వాడుక్యుపట్టి రామస్వామి  వంటి చిత్రాలు ఈ నష్టానికి కారణమయ్యాయి అంటూ తెలియజేశారు. ఈ సినిమాలు థియేటర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఓటీటి హక్కుల విషయంలో లాభాలను అందించలేకపోయాయంటూ తెలియజేశారు.



2024లో ధమాకా సినిమా మంచి లాభంగా నిలిచిన ఇతర చిత్రాల వల్ల వచ్చిన నష్టాలను పూర్తిగా రికవరీ చేయలేకపోయిందంటూ తెలిపారు విశ్వప్రసాద్. ఓటిటి విడుదల తేదీ విషయంపై ఖరారు చేయడంలో అసలు సమస్యలు మొదలవుతున్నాయని, ఓటిటి సంస్థల క్యాలెండర్ ప్రకారం సినిమాలను రిలీజ్ చేయవలసి ఉంటుంది. దానివల్లే నష్టాలు మరింత పెరుగుతున్నాయని తన అభిప్రాయమని తెలిపారు. అందుకే భవిష్యత్తులో ఓటీటీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాల నిర్మాణం విడుదల తేదీలను ప్లాన్ చేసుకోవాలి నిర్మాతలు అంటూ సూచించారు. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో సినిమా షూటింగులు అనుకున్న సమయానికి పూర్తి అవ్వలేకపోతున్నాయి.. ఎంతో కష్టపడి సినిమాను పూర్తి చేస్తే కేవలం ఒక్కరోజులో రివ్యూల వల్ల కొన్ని సినిమాలకు కలెక్షన్స్ పై పెద్ద దెబ్బ పడుతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: