టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ వేదిక గురించి చెప్పాల్సిన పనిలేదు. తన అందం అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గానే ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్స్ పైన విమర్శలు చేయడం, ట్రోల్స్ పైన, దుస్తులపైన కామెంట్స్ చేయడం వంటి వాటిపైన స్పందించింది వేదిక. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్స్ పైన ఎలా పడితే అలా మాట్లాడేందుకు చాలామంది సిద్ధమైపోతున్నారని ఇలాంటి వారు వారి తీరు మార్చుకోవాలంటు తెలియజేస్తోంది వేదిక.



సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ పైన అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు కారణం లేకుండానే వారి యొక్క క్యారెక్టర్ లను చంపేస్తున్నారని కాస్త గ్లామర్ గా కనిపిస్తే చాలు వారి క్యారెక్టర్లనే తప్పు పట్టేలా చేస్తున్నారు. వాస్తవానికి తాను ఇలాంటివి పట్టించుకోనని. తాను బికినీ వేసుకొని నటించడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను నేనేంటో నాకు బాగా తెలుసు అయినా కూడా మారాల్సింది మేము కాదు తప్పుడు బుద్ధి కలవారు అంటూ ఫైర్ అయ్యింది. అలా హీరోయిన్స్ పైన చేస్తున్న కామెంట్స్ కు వేదిక చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


వేదిక విషయానికి వస్తే మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఇమే.. ప్రస్తుత వయస్సు  42 సంవత్సరాలు ఇంకా కుర్ర హీరోయిన్ల లాగా కనిపిస్తూ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ,మలయాళం వంటి భాషలలో హీరోయిన్గా నటిస్తూ  పేరు సంపాదించింది. ఇటీవలే ఇమే యక్షిణి వెబ్ సిరీస్ కూడ విడుదలై భారీ రెస్పాన్స్ లభించింది. వేదిక సినిమాల విషయానికి వస్తే .. చివరిగా రజాకర్, ఫియర్ అలాంటి చిత్రాలలో నటించింది. అలాగే కన్నడ సినిమా అయినా ఘన సినిమాలో కూడా నటించింది ఈ ముద్దు గుమ్మ. వీటితో పాటుగా పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: