కొన్ని కొన్ని సార్లు ఫిల్మ్ మేకర్స్ తీసుకునే నిర్ణయాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని సార్లు డిసప్పాయింట్ చేస్తాయి. సాధారణంగా ఏ సినిమా అయినా ఒక హీరోకి సరిపోయే హీరోయిన్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు మేకర్స్. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో మాత్రం ఆ నిర్ణయం మరింత బలంగా, స్ట్రాటజీతో ఉంటుంది. కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో ఓ స్టార్ డైరెక్టర్‌ గురించి పెద్ద చర్చ మొదలైంది. ట్రోలింగ్ కూడా బాగా జరుగుతోంది. ఆయన మరెవరో కాదు, తన సెన్సిబుల్ మేకింగ్, విభిన్న కథలతో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్.


ప్రస్తుతం సుకుమార్ "పుష్ప" లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత మరోసారి పెద్ద లెవెల్‌లో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈసారి హీరో రామ్ చరణ్‌తో కలసి ఋఛ్17 ప్రాజెక్ట్‌ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసేసి, సినిమా కోసం అన్ని ఏర్పాట్లు సెట్ చేశారు. "పెద్ది" వంటి భారీ సినిమా పూర్తయ్యగానే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి రాబోతుందన్న టాక్ ఉంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన హాట్ టాపిక్ ఏమిటంటే — రామ్ చరణ్‌కు జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నది. మొదటి నుంచే ఈ విషయం గురించి పలు పేర్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఒకసారి సమంత పేరు వచ్చింది, మరొకసారి అంజలి పేరు వినిపించింది. తర్వాత ఐశ్వర్య రాజేష్, రష్మిక మందన్న, జాన్వి కపూర్ పేర్లూ లిస్ట్‌లోకి వచ్చాయి. కానీ ఫైనల్‌గా మాత్రం డైరెక్టర్ సుకుమార్ ఒక డిఫరెంట్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.



తాజా టాక్ ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ అందాల భామ కృతి సనన్‌ను ఫైనల్ చేశారట. మహేష్ బాబు హీరోగా నటించిన "1-నేనొక్కడినే" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి సనన్, ఆ తర్వాత "దోచే", "ఆది పురుష్" వంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా బిజీగా ఉన్న ఈ బ్యూటీని, సుకుమార్ రామ్ చరణ్ జోడీగా తీసుకోవడం పెద్ద సర్ప్రైజ్‌గా మారింది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు కొంతమంది సినీ అభిమానులు కొత్త కాంబినేషన్‌ని ఎంజాయ్ చేస్తూ, "చరణ్-కృతి జోడీ ఫ్రెష్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది" అంటున్నారు. అయితే మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. "చరణ్ పక్కన కృతి సెట్ అవుతుందా? ఇది సరైన కాంబినేషన్ కాదనిపిస్తోంది. ఎందుకింత వింత డెసిషన్ తీసుకున్నారు సుకుమార్ సర్?" అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు.



అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. కాబట్టి రామ్ చరణ్ జోడీగా కృతి సనన్ నిజంగానే నటిస్తుందా..? లేదా..? అన్నది మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కానీ ఈ వార్త ఒక్కటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఋఛ్17 సినిమాకి ముందే హైప్ పెంచేస్తోంది అనడం మాత్రం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: