తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలు అప్పట్లోనే విడుదలయ్యాయి. అలాంటి చిత్రాలు ఇప్పటి తరం ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచేలా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి దర్శకులు చూపించలేనటువంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను అప్పట్లో కెవి రెడ్డి, విఠలాచార్య, ఎన్టీ రామారావు మరి కొంత మంది దర్శకులు తమ చిత్రాలలో చూపించి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. అలాంటి చిత్రాలలో పాతాళ భైరవి కూడా ఒకటి. ఈ సినిమా 73 ఏళ్ల క్రితం వచ్చి అప్పటి ఆడియన్స్ కు హారర్ థ్రిల్ ఫిల్ ని కలిగించిన చిత్రంగా పేరు సంపాదించింది.
నందమూరి తారక రామారావు (తోటరాముడు), ఎస్వీ రంగారావు (నేపాల్ మాంత్రికుడు ), కే మాలతి (ఇందుమతి) ,గిరిజ (పాతాళ భైరవి), బాలకృష్ణ (అంజి గాడు), రేలంగి ( రాజుగారి బావమరిది), సావిత్రి (నర్తకి)! వంటి పాత్రల నటించారు.
షావుకారు జానకి చిత్రాన్ని నిర్మించిన విజయ వాహిని సంస్థ పాతాళభైరవి వంటి చిత్రాన్ని రెండవ చిత్రంగా నిర్మించింది. కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ స్క్రీన్ ప్లే సంభాషణను పింగళి నాగేంద్రరావు అందించారు.
స్టోరీ:
తోటరాముడు గా (సీనియర్ ఎన్టీఆర్) ఉజ్జయినిలోని ఉద్యానవనంలో తోట మాలిగా ఉంటారు. రాకుమార్తే ఇందుమతి (కే.మాలతి) పైన ప్రేమ పెరుగుతుంది.. ఆమెను వివాహం చేసుకోవాలి అంటే రాజు కొన్ని షరతులు పెట్టిన వాటిని నెరవేర్చాల్సి వస్తుంది... అలా సంపాదించేందుకు నేపాలి మాంత్రికుడు (ఎస్వీ రంగారావు) ను ఆశ్రయిస్తారు.. అయితే మాంత్రికుడు తోటరామున్ని బలి ఇచ్చి పాతాళ భైరవి దేవి (గిరిజ) అనుగ్రహాన్ని పొందాలని ప్లాన్ వేస్తారు.. చివరికి తోటరాముడు, మాంత్రికుడు కి ఓడించి పాతాళ భైరవి ఆశీర్వాదంతో ధనం, వైభవాన్ని పొందుతారు. అయితే మాంత్రికుడు శిష్యులు మూలికల సహాయంతో తమ గురువును బ్రతికించి మరి బయటికి తెస్తారు. చివరికి తోటరాముడు మాంత్రికుడిలో ఎవరు గెలుస్తారు? తన ప్రేమను తోటరాముడు గెలిపించుకున్నారా లేదా అనేది సినిమా కథ.
పాతాళ భైరవి సినిమాల డైలాగ్స్ ఇప్పటికి అందర్నీ ఆకట్టుకుంటాయి..
పాతాళభైరవి 1952 లో జరిగినటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ చలనచిత్రంగా దక్షిణాది భారతదేశం నుంచి గుర్తింపు పొందిన ఏకైక చిత్రం.
పాతాళభైరవి సినిమా తెలుగు ,తమిళ భాషలలో ఒకే హీరోతో ఏకకాలంలో నిర్మించిన మొదటి మొదటి ద్విభాష చిత్రం.
28 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకున్న చిత్రంగా పాతాళ భైరవి నిలిచింది.
1980లో పద్మాలయ సంస్థ హిందీలో ఈ చిత్రాన్ని జితేంద్ర హీరోగా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ లో రూపొందించారు.
మొదటిసారిగా తెలుగులో హారర్ ఫాంటసీ సినిమాగా నాంది పలికింది ఈ చిత్రం.
ఈ సినిమా విడుదలై 73 ఏళ్లు అవుతూ ఉన్న పాతాళ భైరవి సినిమా వైవిధ్యం, సాంకేతిక నైపుణ్యం , కథ నిర్మాణంతో శాశ్వత చిత్రమని నిరూపించుకుంది.