
బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ గురించి ఎప్పుడూ రకరకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆమె, సినిమాల విషయంలో ఎంత ఓపెన్‌గా ఉంటుందో, పర్సనల్ లైఫ్ విషయంలో అంత క్లోజ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఆమె వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ బయట పెట్టదు. కేవలం సినిమాలు, ప్రొఫెషనల్ అప్‌డేట్స్ మాత్రమే పంచుకుంటుంది.విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్ పెళ్లయి ఇన్నేళ్లు అవుతున్నా, ఇప్పటివరకు ఎలాంటి “గుడ్ న్యూస్” చెప్పకపోవడంతో అభిమానులు, మీడియా వర్గాలు చాలా చర్చించుకున్నాయి. “ఇంకా ఎందుకు హ్యాపీ న్యూస్ చెప్పట్లేదు..? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా..?” అంటూ రకరకాల కథనాలు కూడా బయటకొచ్చాయి. అంతేకాదు, కొంతమంది ఏకంగా “కత్రినా-విక్కీ మధ్య అనుకోని విభేదాలు వచ్చి, విడాకుల దాకా వెళ్ళిపోతారు” అని కూడా ప్రచారం చేశారు.
అయితే అన్ని రూమర్స్‌కు చెక్ పెడుతూ ఇప్పుడు బయటకు వచ్చిన కత్రీనా బేబీ బంప్ పిక్స్‌తో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కత్రినా కైఫ్ నిజంగానే ప్రెగ్నెంట్ అని అందరూ నమ్మే స్థితికి వచ్చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు కత్రినా-విక్కీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “కత్రినా ఎప్పుడూ హ్యాపీగా, హెల్దీగా ఉండాలి.. ఈ కొత్త జర్నీ చాలా బ్యూటిఫుల్‌గా సాగాలి” అంటూ ప్రతి ఒక్కరూ తమ హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నారు.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు కత్రినా కైఫ్ దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఆమె పబ్లిక్‌గా రియాక్ట్ అవుతుందా..? లేక ఎప్పటిలాగే పర్సనల్ విషయాలను మిస్టరీగానే ఉంచుతుందా అన్నది చూడాలి. కానీ ఏదేమైనా, ఈ న్యూస్‌తో బాలీవుడ్‌లో హ్యాపీ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.