
ఈ క్రమంలోనే మంచు లక్ష్మి అక్కడే స్పాట్‌లో ఆ హోస్ట్‌ను నిలదీయడమే కాకుండా తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఇండస్ట్రీలో వెరీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సెలబ్రిటీలు, నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వస్తున్నారు.తాజాగా టాలీవుడ్ నటి హేమ కూడా ఈ విషయంపై స్పందించింది. టాలీవుడ్ నటి హేమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె మంచు లక్ష్మికి సపోర్టివ్‌గా మాట్లాడింది. అంతేకాదు, ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకుంటే మిగతావాళ్లకి ఏమన్నా సంబంధమా? అన్న రేంజ్‌లోనే ఫైర్ అయిపోయింది.
ఆమె మాట్లాడుతూ – “నేనంటే చదువుకోలేదు. మీడియా వారు చదువుకుని ఇలాంటి ప్రశ్నలు అడగడం ఎంతవరకు కరెక్ట్? అసలు బాడీ షేమింగ్ చేయడమేంటండి? చదువుకున్న వారు, పెద్దవారు ఆ మాత్రం తెలీదా? అలాంటి ప్రశ్నలు ఒక అమ్మాయిని అడగచ్చా లేదా అన్న ఇంగితజ్ఞానం కూడా ఉండదా? ఏది అడగాలి, ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు అనే విషయంపై ఆమాత్రం మినిమం కామన్ సెన్స్ ఉండదా?” అంటూ ఫైర్ అయిపోయింది.అలాగే – “మీడియా వారు సెలబ్రిటీల గురించి ఎలా మాట్లాడినా తప్పులేదు, కానీ సెలబ్రిటీలు ఒక చిన్నమాట అంటే మాత్రం వెంటనే క్షమాపణలు చెప్పే వరకు వదలరు” అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది. గతంలో సుమా కనకాలం మీడియా వారు “టిఫిన్లను భోజనం లాగా చేస్తున్నారు” అని సరదాగా మాట్లాడిన మాటలను సీరియస్‌గా తీసుకున్న విషయాన్ని మరోసారి హైలైట్ చేసింది. అంతే కాదు, వేణు స్వామి నాగచైతన్య–సమంతల విషయంలో చేసిన కామెంట్స్ పట్ల జరిగిన రియాక్షన్‌ను కూడా మరోసారి హాట్ టాపిక్‌గా మార్చింది.ఇంత జరుగుతున్నా కూడా – “మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేస్తున్నారు? తన సొంత సోదరికి ఇలాంటి అవమానం జరిగితే సైలెంట్‌గా ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నా విషయంలో మాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా వెంటనే నన్ను సస్పెండ్ చేశారు” అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది.
“మరి ఇప్పుడు ఎందుకని మీడియా వారిని ప్రశ్నించడం లేదు? మంచు విష్ణు, మీ సోదరికి జరిగిందంటే రేపు మరొక నటికి జరగదా? ఏం జరిగినా ఇలాగ పట్టించుకోకుండా సైలెంట్‌గా ఉంటారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన వాళ్లు నటి హేమను ట్రోల్ చేయడం ప్రారంభించారు. “మంచు లక్ష్మికి సపోర్ట్‌తో పాటు పనిలో పని నీ సస్పెన్షన్ కూడా ఎందుకు చేశారు అని హైలైట్ చేస్తున్నావా? నువ్వు నిజంగానే మహానటి హేమా?” అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.కొంతమంది మాత్రం నటి హేమ తీసుకున్న స్టాండ్ పట్ల హ్యాపీగా ఉన్నారు. “ఇలాంటి వాళ్లే ఇండస్ట్రీకి కావాలి. ఒక ఆడదానికికి కష్టం వచ్చినప్పుడు మరొక ఆడది ఇలా సపోర్ట్‌గా నిలవాలి. మిగతా హీరోయిన్స్ కూడా మంచు లక్ష్మికి సపోర్ట్ చేయాలి” అంటూ ఘాటుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.