
పుష్ప 2 మేకర్స్ ముందుగానే ప్రభుత్వాల నుంచి ప్రీమియర్ షోలకు అనుమతులు తెచ్చుకున్నారు. ఆ ప్రీమియర్ టికెట్లను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో ఉంచి బుకింగ్స్ ఓపెన్ చేశారు. అది కూడా రిలీజ్‌కు నాలుగు రోజుల ముందు నుంచే. ఫలితంగా ఫస్ట్ డే పుష్ప 2 రికార్డు ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ డే 1 కలెక్షన్స్ నమోదు చేసింది. ప్రీమియర్స్ వల్ల మరో అదనపు లాభం ఉంది. ఒకవేళ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా, ఆ ప్రీమియర్ షోల రూపంలో భారీ వసూళ్లు డే 1లోనే చేరిపోతాయి. అదే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వీకెండ్ వరకు అద్భుతమైన రన్ జరుగుతుంది. పుష్ప 2 విషయంలో ఇదే జరిగింది.
అలాగే సరైన టైమింగ్‌లో ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే డే 1 రికార్డులు సులభమే అని పుష్ప 2 ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. కానీ పుష్ప 2 నేర్పిన ఈ పాఠాన్ని `ఓజీ` మేకర్స్ మాత్రం మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఓజీకి భారీ హైప్ ఉంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ట్రేడ్ సర్కిల్స్ కూడా ఈ సినిమాపై బిగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే మేకర్స్ ప్రీమియర్ షోలకు అనుమతి తెచ్చుకున్నారు. కానీ ఇప్పటివరకు ప్రీమియర్ షోలకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఈ విషయంపై ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ప్లానింగ్ లోపమా? లేక మొదట వీకెండ్ బుకింగ్స్ ఫుల్ చేయించి, ఆ తర్వాతే ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేద్దాం అనే స్ట్రాటజీని ఓజీ టీమ్ ఫాలో అవుతుందా? అన్నది తెలియాలి. కాగా, సినిమాపై ఎంత హైప్ ఉన్నప్పటికీ, మొదటి రోజు రికార్డు ఓపెనింగ్స్ కోసం సరైన ప్లానింగ్ చేయకపోతే ఓజీ రన్‌పై డైరెక్ట్ ఇంపాక్ట్ పడే అవకాశం కచ్చితంగా ఉంది.