పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఓజి సినిమా నిన్న అనగా సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... శ్రేయ రెడ్డి , అర్జున్ దాస్ , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని డి వి వి దానయ్య నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా యూనిట్ తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఓ ముద్దుగుమ్మ ఆశలన్నీ గల్లంతయ్యాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

అసలు విషయం లోకి వెళితే ... ఓజి మూవీ యూనిట్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మణులలో ఒకరు అయినటువంటి నేహా శెట్టి తో ఓ ఐటమ్ సాంగ్ ను షూట్ చేశారు. ఇక ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా నేహా శెట్టి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇక చాలా మంది ఓజి లాంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్లో నటించిన అంటే ఆ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఆ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి అద్భుతమైన అవకాశాలు వస్తాయి అని చాలా మంది భావించారు. 

ఇక తీరా సినిమా చూస్తే ఈ ముద్దుగుమ్మ నటించిన సాంగ్ ఈ మూవీ లో లేదు ఈ మూవీ నుండి నేహా శెట్టి నటించిన ఐటమ్ సాంగ్ తీసివేయడానికి ప్రధాన కారణం. ఈ మూవీ లో పవన్ , ప్రియాంక మధ్య మంచి సన్నివేశాలు వస్తున్న సమయంలో ఇది డిస్టబెన్స్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సాంగ్ను తీసేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ గనుక ఉండి ఉన్నట్లయితే ఈ మూవీ ద్వారా నేహా శెట్టి క్రేజ్ అద్భుతమైన రీతిలో పెరిగి ఉండేది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: