ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ సుజిత్ పేరు బాగా మారుమ్రోగిపోతుంది. దానికి కారణం అందరికీ తెలిసిందే. ఓఘ్ సినిమా కారణంగానే. ఇది ఎప్పటికి మర్చిపోలేం — పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వడం, సినిమాకి డైరెక్ట్ చేయడం, సినిమాను వేరే లెవెల్‌లో తీసుకెళ్లడం సుజిత్ అన్నీ చకచకా జరిగిపోయాయి. అవును, సినిమా షూట్ చేయడానికి టైమ్ ఎక్కువగానే పట్టింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ గ్యాప్ అభిమానులకు ఎక్కడా కనిపించలేదు.“పవన్ కళ్యాణ్‌ను ఎలా చూడాలి అనుకున్నామో, అలా చూపించావు. థ్యాంక్స్ సుజిత్ బ్రో!” అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్మెంట్‌తో, ఎమోషనల్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో ఎక్కడ చూసినా సుజిత్–పవన్ కళ్యాణ్ పేర్లే వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వీరి కాంబినేషన్ గురించి జనాలు హైప్ ఇస్తూ మాట్లాడుకుంటున్నారు. ఓజీ సినిమా హిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా సుజిత్‌కి కాల్ చేసి స్పెషల్‌గా అప్రిసియేషన్ ఇచ్చారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే సుజిత్‌కి బంపర్ ఆఫర్ కూడా వచ్చిందని ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. మెగా హీరోలతో సినిమా చేసే ఛాన్స్ చాలా తక్కువ మందికే దక్కుతుంది. అది కూడా బిగ్ పాన్-ఇండియా స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం అంటే చాలా రేర్. ఎన్నో సినిమాలు తీశాక, ఎన్నో హిట్స్ కొట్టాక, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటేనే ఆ ఛాన్స్ రావడం సాధ్యం. కానీ పవన్ కళ్యాణ్ తలచుకుంటే అది సెకన్లలోనే జరుగుతుంది.

అలాంటి సెకన్ల మ్యాజిక్ సుజిత్ లైఫ్‌లో జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ స్వయంగా సుజిత్‌కి బంపర్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. “నువ్వు మంచి కథ రెడీ చేస్తే, రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం ఇప్పిస్తాను” అంటూ పవన్ మాటిచ్చాడని టాక్. ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. “మళ్లీ మెగా హీరోతో సినిమానా..? ఈసారి రామ్ చరణ్ పాత్రలో చూపిస్తే ఇంకా బాగుంటుంది” అంటూ సజెస్ట్ చేస్తున్నారు. చూడాలి మరి సుజిత్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..??ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఒకవేళ చరణ్ తో మూవీ చేసి హిట్ కొడితే..ఇక మెగా ఫ్యామిలీకి లక్కి డైరెక్టర్ అయిపోతాదూ సుజిత్. ఇంచు మించు మెగా ఫ్యామిలీ మెంబర్ అనే చెప్పాలి అంటున్నారు ఫ్యాన్స్..!


 

మరింత సమాచారం తెలుసుకోండి: