
మొత్తం మీదా సినిమా గురించి అన్ని విభాగాలపై పాజిటివ్ టాక్ రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. కానీ, ఈ హైప్లో ఒకే ఒక విషయం మాత్రం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. అదేంటంటే — హీరోయిన్ ప్రియాంక మోహన్ పాత్ర. ప్రేక్షకులు, అభిమానుల మాటల్లో చెప్పాలంటే, ప్రియాంక మోహన్ పాత్ర సినిమాలో పూర్తిగా బిస్కెట్ అయిపోయింది. స్క్రీన్ టైమ్ పరంగా ఆమె రోల్ చాలా తక్కువగా వచ్చిందని అందరూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు సినిమా రిలీజ్ కాకముందే పవన్ కళ్యాణ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని సూచిస్తూ, “మా మధ్య కనిపించే అనుబంధం చాలా తక్కువసేపు ఉన్నా, అది ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది” అని చెప్పినా, ప్రేక్షకులు అంత తక్కువగా ఉంటుందని మాత్రం ఊహించలేదు.
సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే, ప్రియాంక మోహన్ పాత్ర తెరపై పట్టుమని అరగంట కూడా కనిపించదు. పవన్ కళ్యాణ్‌తో ఆమె సీన్స్ బాగా ఎమోషనల్‌గా, అట్ట్రాక్టివ్‌గా ఉన్నప్పటికీ, ఆమె క్యారెక్టర్ టైం చాలా తక్కువ కావడం వల్ల ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. సుజిత్ ఈ విషయంలో తప్పు నిర్ణయం తీసుకున్నారని, ప్రియాంక పాత్రను మరికొంచెం లెంగ్త్‌లో డిజైన్ చేసి ఉంటే సినిమా ఇంకా వేరే లెవెల్‌లో ఉండేదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్–ప్రియాంక మోహన్ మధ్య కొన్ని నాటి స్టైల్ రొమాంటిక్ సీన్స్ లేదా ఇంకొంచెం ఎమోషనల్ సన్నివేశాలు చేర్చుంటే, ఈ సినిమాకు అదనపు మైలేజ్ వచ్చేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ప్రియాంక మోహన్ ఈ సినిమాపై పెట్టుకున్న అన్ని ఆశలు వృథా అయ్యాయని, ఆమె రోల్‌ని పెద్దగా ఎవ్వరూ గుర్తు చేసుకోవడం లేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఇక సినిమా హిట్ అయ్యాక కూడా ఎక్కడ చూసినా డైరెక్టర్ సుజిత్, హీరో పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. కానీ హీరోయిన్ ప్రియాంక మోహన్ పేరు మాత్రం ఎక్కడా వినిపించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అభిమానుల మాటల్లో చెప్పాలంటే, “OG లో ప్రియాంక మోహన్ క్యారెక్టర్ నిజంగానే బిస్కెట్ అయిపోయింది” అనేది వాస్తవం.