
ఎందుకంటే ఓజీలో పవన్ ను ఎలా చూడాలని ఫాన్స్ అనుకున్నారో అలానే కనిపించారు . ఈ ఏడాది హిట్ కొట్టకుండానే మెగా ఫ్యామిలీ ఉంటుందా అనుకున్న టైం లో ఓజి వారి కోరికను నెరవేర్చింది . ఈ మూవీ ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే ఉండడంతో హిట్ టాక్ సొంతం చేసుకుంది . దీంతో మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది ఓజీ రూపంలో మంచి విజయం దక్కింది . దీని అనంతరం ఈ ఏడాది మెగా హీరోల నుంచి వేరే సినిమాలు లేవు . వచ్చే సంక్రాంతికి చిరంజీవి సినిమా రాబోతుంది . ఉస్తాద్ భగత్ సింగ్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది . అది డిసెంబర్లో వస్తుందనే ప్రచారం ఇప్పటికీ సోషల్ మీడియాలో నడుస్తుంది .
మరి ఏం జరగనుందో చూడాలి . ఏదేమైనాప్పటికీ మెగా ఫ్యామిలీకి హిట్ కొట్టలేదన్న లోటును పవన్ కళ్యాణ్ తీర్చేసాడు అని చెప్పుకోవచ్చు . ఇక ప్రజెంట్ ఓజీ మూవీ థియేటర్లని షేర్ చేస్తుందని చెప్పుకోవచ్చు . సెప్టెంబర్ 25 వ తారీఖున రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే మంచి పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది . సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు . సుచిత్ డైరెక్షన్ కి తమన్ బిజిఎం పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో థియేటర్లు మూత మోగిపోతున్నాయి .