టాలీవుడ్ లో ఎంతోమంది విలన్ గా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో నటించారు. అలాంటి వారిలో హ్యాండ్సమ్ విలన్ గా పేరు పొందారు నటుడు గణేష్ వెంకట్రామన్. ఢమరుకం చిత్రంలో (రాహుల్) పాత్రలో అద్భుతంగా నటించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా నటించారు. ఇక ఈయన భార్య కూడా టాలీవుడ్ లో తోపు హీరోయిన్ అని చాలామందికి తెలియకపోవచ్చు. వాటి గురించి చూద్దాం



గణేష్  వెంకట్రామన్ మొదటిసారిగా 2009లో వచ్చిన ఈనాడు సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఆ తర్వాత ఢమరుకం చిత్రంలో నటించి విలన్ గా పేరు సంపాదించారు. చివరిగా శబరి అనే చిత్రంలో నటించారు. గణేష్  వెంకట్రామన్ సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్, పలు రకాల రియాల్టీ షోలలో కూడా కనిపించారు. అలాగే తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో, 3లో  రన్నర్ గా నిలిచారు. గణేష్  వెంకట్రామన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈయన భార్య నిషా కృష్ణన్. ఈమె తమిళంలో స్టార్ హీరో విశాల్ నటించిన ఇంద్రుడు చిత్రంలో నటించినది. అలాగే కృష్ణుడికి వారసుడు అనే చిత్రంలో కూడా నటించింది.



తెలుగులో కూడా ఒక సీరియల్లో నటించింది. ఆ సీరియల్ శ్రీమంతుడు. నిజానికి ఈమె క్రేజ్ తెచ్చి పెట్టింది మాత్రం మహాభారతం సీరియల్ అని చెప్పవచ్చు. సన్ టీవీలో వచ్చిన ఈ సీరియల్ లో ద్రౌపది పాత్రలో అద్భుతంగా నటించింది నిషా. తనకి నటన అంటే చాలా ఇష్టం ఉండడంతో సిని రంగంలో రాణించడానికి ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటిస్తోందట. అందుకే ఆమెకు అవకాశం వచ్చిన ప్రతిపాదన కూడా వదులుకోలేదు. గణేష్ వెంకట్రామన్ నటించిన ఢమరుకం సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించగా అప్పట్లోనే సుమారుగా రూ .48 కోట్ల రూపాయల ఖర్చయింది. ఇందులో హీరోయిన్ గా అనుష్క నటించింది. కానీ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: