ప్రతి సంవత్సరం మాదిరి గానే వచ్చే సంవత్సరం సంక్రాంతికి కూడా అనేక సినిమాలు విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల విడుదల తేదీలు కూడా వచ్చేసాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో దాదాపు నాలుగు క్రేజీ సినిమాలు నిలిచే అవకాశాలు ఉన్నాయి. లిస్ట్ లోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరో గా నయన తార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమాను కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు.

ఇక నవీన్ పోలిశెట్టి హీరో గా మీనాక్షి చౌదరి హీరోయిన్గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాను కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలతో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా ఈ సంవత్సరం నలుగురు క్రేజీ హీరోలు నటిస్తున్న సినిమాలు సంక్రాంతి బరిలో నిలబబోతున్నాయి.

ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో ఈ నిలిచే ఈ నాలుగు సినిమాలు కూడా ప్రధానంగా కామెడీ ఎంటర్టైనర్ లే. దానితో ఈ సంవత్సరం పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ యాక్షన్ మూవీలు రావడం లేదు. ఇది సంక్రాంతి సమయం లో భారీ యాక్షన్ సినిమాలు చూడాలి అని అభిమానులకు కాస్త నిరాశ పరిచే విషయం అని చెప్పాలి. మరి ఈ సంవత్సరం సంక్రాంతి బరిలోకి ఈ నాలుగు సినిమాలతో పాటు మరే సినిమాలైనా విడుదల అవుతాయా ..? ఈ సినిమాలలో ఏవైనా సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: