సినిమాలు వెంటవెంటనే తీయడం లేదా వరుసగా విడుదల చేయడం కంటే — ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల మనసుల్లో ఎంత ప్రభావం చూపించగలిగాం, వాళ్లు ఆ సినిమా నుంచి ఏమి నేర్చుకున్నారు, ఎంతవరకు ఎంటర్టైన్ అయ్యారు.. ఆ సినిమా చూసిన తర్వాత ఆ హీరో ఫ్యాన్స్ ఎంత సంతృప్తిగా ఉన్నారు అనే విషయాలే నిజమైన విజయానికి కొలమానాలు. ఈ విషయంలో మన తెలుగు దర్శకులు కొంతవరకు ఫుల్ ఫీల్ అవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ జాబితాలో టాప్ పొజిషన్‌లో ఉన్న దర్శకుడు సుకుమార్. తెలుగు ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, అభిమాన వర్గం ఉంది. ప్రత్యేకంగా ‘పుష్ప’ సినిమాతో ఆయన తన క్రియేటివిటీని, న్యారేషన్‌ స్టైల్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లి తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచుకున్నారు. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ తీసే ప్రతి ప్రాజెక్ట్‌ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి.


ఇప్పుడు సోషల్ మీడియాలో, సినిమా సర్కిల్స్‌లో సుకుమార్‌కి సంబంధించిన ఒక హాట్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. సుకుమార్‌ త్వరలోనే రామ్ చరణ్‌తో ఒక భారీ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కూడా ‘రంగస్థలం’ తరహాలోనే గ్రామీణ నెపథ్యంతో, భావోద్వేగాలతో నిండిన కథగా రూపుదిద్దుకుంటుందని ఫిలిం నగర్ టాక్. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి సనన్ ని తీసుకునే ఆలోచన చేశారని వార్తలు వచ్చాయి. అయితే, తర్వాత సుకుమార్ ఆ పాత్రను రుక్మిణి వసంత్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని తాజా సమాచారం. రుక్మిణి ప్రస్తుతం దక్షిణాదిలో బాగా ట్రెండ్ అవుతున్న న్యూ జనరేషన్ హీరోయిన్. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి సుకుమార్ ఆకట్టుకున్నాడని చెబుతున్నారు.



ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర — ‘రంగమ్మత్త’ లాంటి రోల్‌ — కోసం కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ‘రంగస్థలం’ సినిమాలో ఆ పాత్రను అనసూయ అత్యద్భుతంగా పోషించి అందరి హృదయాల్లో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ స్థాయిలోని పాత్రను కొత్తగా వేరే హీరోయిన్‌తో చేయించాలనే ఆలోచనలో ఉన్నారట సుకుమార్. తాజా టాక్ ప్రకారం, ఆ ప్రత్యేక పాత్ర కోసం హీరోయిన్ రాశిని రంగంలోకి దింపబోతున్నారని వార్తలు వస్తున్నాయి. రాశి తన అందచందాలతో, నటనతో గతంలోనే ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ‘గోకులంలో సీత’ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్న రాశి, ఇప్పుడు మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చి కొన్ని ఆఫర్లు స్వీకరిస్తోంది.



ఇప్పుడు ఇంత పెద్ద దర్శకుడి ప్రాజెక్ట్‌లో ఇంత ముఖ్యమైన పాత్ర రావడం రాశికి నిజంగా పెద్ద అవకాశం అని అభిమానులు చెబుతున్నారు. అయితే, ఒకప్పుడు అనసూయ చేసినంత ఘాటుగా, అంత పర్ఫెక్షన్‌తో రాశి ఆ పాత్రలో మెప్పించగలదా..?? అనే ప్రశ్న మాత్రం అందరి నోట వినిపిస్తోంది. కానీ, “సుకుమార్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే” అని అంటున్నారు సినీ సర్కిల్స్.  చూడాలి మరి — సుకుమార్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, నిజంగా రాశినే ఫైనల్ చేస్తాడా? లేదా ఇంకా ఏదైనా సర్‌ప్రైజ్ ఇచ్చే ప్లాన్‌లో ఉన్నాడా? అన్నది తెలుసుకోవడానికి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఈ సినిమా చుట్టూ ఇప్పటికే క్రేజ్ పెరిగిపోతోంది. రామ్ చరణ్, రుక్మిణి వసంత్ కాంబినేషన్‌తో, సుకుమార్ మాస్టర్ టచ్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ టాలీవుడ్‌లో వచ్చే మరో హిస్టారికల్ బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: